Team India: అనూహ్యంగా ‘ప్రధానమంత్రి’ మ్యూజియంలో ప్రత్యక్షమైన రోహిత్ సేన.. వైరల్ అవుతున్న ఫోటోలు..

మ్యాచ్ అనంతరం రోహిత్ సేన రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని(మ్యూజియాన్ని) సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను..

Team India: అనూహ్యంగా ‘ప్రధానమంత్రి’ మ్యూజియంలో ప్రత్యక్షమైన రోహిత్ సేన.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Team India Visiting Pradhanmantri Sangrahalaya
Follow us

|

Updated on: Feb 19, 2023 | 9:09 PM

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ సేన రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని(మ్యూజియాన్ని) సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ‘స్వాతంత్య్రం తర్వాత భారతదేశ ప్రయాణాన్ని వివరిస్తూ.. దేశ ప్రధాన మంత్రులకు అంకితం చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని టీమిండియా సందర్శించంది’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతకముందు ఆసీస్, టీమిండియా మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 ప్రారంభమైన మ్యాచ్‌ భారత్ విజయంతో 3 రోజులలోనే ముగిసింది. నాగ్‌పూర్ వేదికగా మొదటి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఈ టెస్టులో కూడా గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది.

ఇంకా ఈ రెండో మ్యాచ్‌లో కోహ్లీ చేసిన పరుగుల(44, 20) ద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 25,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాక అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా సచిన్‌ను అధిగమించాడు. అలాగే 25,000 పరుగులు చేసిన 6వ క్రికెటర్‌గా, రెండో భారతీయుడిగా రికార్డులకెక్కాడు. అలాగే ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లలో టీమిండియాకు ఇది 13వ విజయం. మరోవైపు ఈ మ్యాచ్‌ ద్వారా తన 100వ టెస్ట్ ఆడిన చతేశ్వర్ పుజారా కూడా విన్నింగ్ బౌండరీ షాట్ కొట్టి.. అలా చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే జడేజా కూడా తన కెరీర్ బెస్ట్(10/110) గణాంకాలను నమోదు చేసుకున్నాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్‌లో.. టీమిండియా మరో విజయం సాధిస్తే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌(2021-23) ఫైనల్‌కు చేరుతుంది. అలా డబ్య్లూటీసీ ఫైనల్‌కు భారత్ చేరితే.. ఇప్పటివరకు జరిగిన చాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా భారత్ అవతరిస్తుంది. అంతకముందు జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(2021)లో ఫైనల్‌కు చేరిన భారత్ న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌.. రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌
బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌.. రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌
గిరజాల జుట్టు పోషణకు ఇలా చేయండి.. నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!
గిరజాల జుట్టు పోషణకు ఇలా చేయండి.. నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!
అలర్ట్.. ఊబకాయం నేరుగా డిమెన్షియాకు కారణమవుతుందా..?
అలర్ట్.. ఊబకాయం నేరుగా డిమెన్షియాకు కారణమవుతుందా..?
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన 700 వికెట్ల దిగ్గజ బౌలర్
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన 700 వికెట్ల దిగ్గజ బౌలర్
ఈ టీ అలవాటు మంచిదే..! తాజా అధ్యయనం వెల్లడి
ఈ టీ అలవాటు మంచిదే..! తాజా అధ్యయనం వెల్లడి
మంచి కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 20 వేల బడ్జెట్‌లో..
మంచి కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 20 వేల బడ్జెట్‌లో..
#90's వెబ్ సిరీస్‏లో నటించిన అమ్మాయి గుర్తుందా ..?
#90's వెబ్ సిరీస్‏లో నటించిన అమ్మాయి గుర్తుందా ..?
పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు! ఓటింగ్‌ శాతం పెరుగుతుందా?
పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు! ఓటింగ్‌ శాతం పెరుగుతుందా?
పిడుగుపాటు వల్ల ఏసీ, టీవీ, ఫ్రిజ్‌లకు ప్రమాదం..నివారించడం ఎలాగంటే
పిడుగుపాటు వల్ల ఏసీ, టీవీ, ఫ్రిజ్‌లకు ప్రమాదం..నివారించడం ఎలాగంటే
గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి ధోని కాళ్లపై పడిన అభిమాని.. వీడియో చూశారా
గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి ధోని కాళ్లపై పడిన అభిమాని.. వీడియో చూశారా