Longest Phone Call: ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్.. ఏకంగా 2 రోజుల పాటు ఇద్దరే.. ఆ వివరాలివే..

2012లో నమోదైన ఈ కాల్.. అత్యంత పొడవైన ఫోన్ కాల్ రికార్డ్‌గా అయింది. కాల్ మాట్లాడినంత సేపు వీరిద్దరూ 10 సెకన్లకు మించి మౌనంగా లేరు. అయితే..

Longest Phone Call: ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్.. ఏకంగా 2 రోజుల పాటు ఇద్దరే.. ఆ వివరాలివే..
Longest Phone Conversation
Follow us

|

Updated on: Feb 20, 2023 | 3:43 PM

ఒకప్పటి రోజుల్లో సమాచారం ఇతరులకు చేరవేయాలంటే అంతా ఉత్తరాలతోనే పని. అయితే కాలానుగుణంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ సహాయంలో క్షణాల్లో పనులు జరిగిపోతున్నాయి. ఆ క్రమంలోనే ఫోన్ కాల్, మెసేజింగ్, మెయిల్ ఇలా పలు రకాలుగా సమాచారాన్ని ఇతరులకు తెలియజేయగలుగుతున్నాం. అయితే ఏ సమాచారమైన ఇతరులకు తెలియజేయడానికి మహా అయితే గంట సమయం ఎక్కువ. ఫోన్ కాల్ చేసి.. విషయం చెప్పేసి కాల్ కట్ చేసేస్తాం. అంతే కదా.. ఏదైనా ప్రత్యేక సందర్భం అయితే రెండు, మూడు గంటలపాటు ఫోన్ మాట్లాడడం జరుగుతుంది.  ఇలా ఏదో ఒక సందర్భంగా అందరూ చేసే ఉంటారు. కొంతమంది తమ స్నేహితులతో, మరికొందరు వారి కుటుంబ సభ్యులతో లేదా వారి ప్రేమించిన వారితో సుదీర్ఘ సంభాషణలు చేస్తారు. గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడే వారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా ఎవరైనా ఫోన్ కాల్‌లో ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే మాట్లాడగలరు.

అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫోన్ కాల్ (వ్యక్తిగతంగా) ఎంతసేపు ఉందో తెలుసా..? హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఎరిక్ ఆర్. బ్రూస్టర్, అవరీ ఎ. లియోనార్డ్‌ ఏకంగా 46 గంటల 12 నిమిషాల 52 సెకన్ల పాటు ఒకరితో మరొకరు కాల్ మాట్లాడుకున్నారు. 2012లో నమోదైన ఈ కాల్.. అత్యంత పొడవైన ఫోన్ కాల్ రికార్డ్‌గా అయింది. కాల్ మాట్లాడినంత సేపు వీరిద్దరూ 10 సెకన్లకు మించి మౌనంగా లేరు. అయితే ప్రతి గంట తర్వాత వారు శక్తిని తిరిగి పొందడానికి ఐదు నిమిషాల విరామం ఇచ్చారు. వాస్తవానికి ఇది ఒక చిట్ చాట్ షో. అంతకుముందు 2009లో సునీల్ ప్రభాకర్ అత్యధిక సేపు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అతను దాదాపు 51 గంటల పాటు ఫోన్ కాల్‌లో మాట్లాడాడు. కానీ అతను వేర్వేరు వ్యక్తులతో కాల్ మాట్లాడాడు. ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మరో వ్యక్తికి కాల్ ట్రాన్స్‌ఫర్ అయ్యేది.

ఇవి కూడా చదవండి

  కాగా, గిన్నీస్ వరల్డ్ రికార్డును హివెన్ అనే ట్విట్టర్ ఖాతాదారు.. ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన 2012 నాటిది అయినప్పటికీ.. ‘ఎరిక్ ఆర్. బ్రూస్టర్, అవరీ ఎ. లియోనార్డ్‌ ఫోన్ కాల్’ ఇప్పటికీ అత్యంత సుదీర్ఘమైన ఫోన్ కాల్‌గా కొనసాగుతోంది.

మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి