AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mayor Vijaya Lakshmi: ‘వెంటనే విచారణ చేయిస్తాం’.. బాలుడి మృతిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ మేయర్..

వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై జీహెచ్‌ఎంసీ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. నగరంలోని..

Mayor Vijaya Lakshmi: ‘వెంటనే విచారణ చేయిస్తాం’.. బాలుడి మృతిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ మేయర్..
Ghmc Mayor Gadwal Vijaya Lakshmi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 21, 2023 | 4:38 PM

Share

హైదరాబాద్‌‌ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై జీహెచ్‌ఎంసీ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని వీధి కుక్కల బెడదకు నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నగరంలోని కుక్కలకు స్టెరిలైజ్ చేసేందుకు ప్రతిరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని, ఇప్పటికే 4 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాలుడి మృతి చెందిన ఘటనపై వెంటనే ఎంక్వయిరీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై చర్చించేందుకు ఈరోజు(ఫిబ్రవరి 21) మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆమె అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీలో జోనల్ కమీషనర్లు, వెటర్నరీ సిబ్బంది హాజరయ్యారు.

అంతకముందు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడు ప్రదీప్‌(4) కుటుంబానికి సంతాపం తెలిపారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీధికుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రతీ మున్సిపాలిటీలోనూ వీధి కుక్కల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాల‌ను, జంతు జ‌న‌న నియంత్రణ కేంద్రాల‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుక్కల స్టెరిలైజేష‌న్ కోసం చర్యలు చేప‌ట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.

కాగా.. కాగా వీధి కుక్కలు దాడి చేయడంతో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం తండ్రి పనిచేస్తున్న కారు సర్వీస్‌ సెంబర్‌ వద్దకు వెళ్లిన చిన్నారిని వీధి కుక్కలు వెంటాడాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసినా.. అవి వదలకుండా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటినా ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..