Heart Attack Reasons: యువతలో కొత్త రకమైన గుండెపోటు ప్రమాదం..ఆహార అలవాట్లే ప్రధాన కారణం

తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కారిడార్ నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. యువతలో సడెన్ గుండెపోటు రావడానికి కారణమేంటి? అనే విషయాన్ని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

Heart Attack Reasons: యువతలో కొత్త రకమైన గుండెపోటు ప్రమాదం..ఆహార అలవాట్లే ప్రధాన కారణం
Heart Attack
Follow us
Srinu

|

Updated on: Mar 04, 2023 | 5:30 PM

కరోనా తర్వాత వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు ప్రమాదం అందరిని భయపెడుతుంది. ముఖ్యంగా అప్పటి దాకా మనతో సరదాగా గడుపుతున్నవారే సడెన్‌గా గుండెపోటుకు గురై మనకు దూరమవుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పెళ్లిలో పెళ్లి కొడుకుతో మాట్లాడుతూనే గుండెపోటుకు గురైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కారిడార్ నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. యువతలో సడెన్ గుండెపోటు రావడానికి కారణమేంటి? అనే విషయాన్ని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం యువతకు వచ్చే గుండె పోటు విడో మేకర్ హార్ట్ స్ట్రోక్‌గా వైద్యులు అంచానా వేస్తున్నారు. ముఖ్యంగా ఆహార అలవాట్ల కారణంగానే ఈ రకమైన గుండె పోటు అధికంగా వస్తుందని పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన కూరగాయల కంటే ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల శారీరక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. 

విడోమేకర్ గుండె పోటు అంటే ఏంటి?

విడోమేకర్ గుండెపోటును వైద్య పరిభాషలో మయోకార్డియల్ ఇన్‌ఫార్షన్ అని అంటారు. ఒక వ్యక్తికి ఎడమ వైపున గుండెకు సంబంధించిన అతిపెద్ద ధమనిలో ఎల్ఏడీ అడ్డుపడడం వల్ల ఈ గుండెపోటు వస్తుంది. ఎల్ఏడీ ధమని ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండె ఎడమవైపునకు పంపుతుంది. తద్వారా ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని శరీరంలో అందుకుంటుంది. గుండె కండరాల రక్త సరఫరాలో 50 శాతం ఎల్ఏడీ అందిస్తుంది. కాబట్టి ఈ సమస్య వల్ల వచ్చే గుండెపోటు తక్షణమే ప్రాణాంతకమవుతుంది. ఈ రకమైన గుండెపోటు ఎక్కువగా మగవారికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, గుండె పరిస్థితి, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికి విడోమేకర్ గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

విడోమేకర్ గుండెపోటు లక్షణాలు ఇవే

కాంతిహీనత, ఛాతి నొప్పి,, కడుపు నొప్పి, ఎగువ శరీరంలోని  చేతులు, భుజాలు, మెడ, దవడ వంటి ప్రాంతాల్లో నొప్పులు, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎల్ఏడీ ధమనిలో కొలెస్ట్రాల్, ఇతర నిక్షేపాలు పెరగడం లేదా రక్తం గడ్డకట్టడం వల్ల విడో మేకర్ గుండెపోటుకు కారణం కావచ్చు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈకేజీ), ఛాతీ ఎక్స్-రే, హార్ట్ ఎంఆర్ఐ, రక్త పరీక్షలు, ఎకోకార్డియోగ్రామ్, కార్డియాక్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ), న్యూక్లియర్ హార్ట్ స్కాన్, కరోనరీ యాంజియోగ్రామ్ వంటివి విడో మేకర్ గుండెపోటు గుర్తించడంలో సాయం చేస్తాయి. గుండెపోటును నివారించడానికి, తక్కువ చక్కెర కంటెంట్, సంతృప్త కొవ్వులు లేని ఆహారాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. డయాబెటిక్‌ రోగులు వైద్యుల సూచన మేరకే తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మందులను ఆపేసి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిది కాదని గుర్తించాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..