AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Men Health: సంతానలేమితో బాధపడుతున్నారా? పురుషులు ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ఒక వివాహిత జంటకు పిల్లలు పుట్టడానికి మించిన ఆనందం, సంతోషకరమైన అంశం మరోటి లేదు. ప్రతీ జంట తాము తల్లిదండ్రులు కావాలనే కోరుకుంటుంది. అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఎంతోమంది..

Men Health: సంతానలేమితో బాధపడుతున్నారా? పురుషులు ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Men Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 04, 2023 | 5:30 PM

ఒక వివాహిత జంటకు పిల్లలు పుట్టడానికి మించిన ఆనందం, సంతోషకరమైన అంశం మరోటి లేదు. ప్రతీ జంట తాము తల్లిదండ్రులు కావాలనే కోరుకుంటుంది. అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఎంతోమంది దంపతులు సంతానలేమి సమస్యలతో సతమతం అవుతున్నారు. పిల్లల కోసం తిరగని ఆస్పత్రు లేవు, ఎక్కడి గుడి మెట్లు లేవు అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే, ఒక జంటకు పిల్లలు పుట్టాలంటే.. స్త్రీ, పురుషుల ఇద్దరి ఆరోగ్యం చాలా ముఖ్యం. స్త్రీలలో అండం ఎంత ముఖ్యమో.. పురుషుల వీర్యం కూడా అంతే ముఖ్యం. పిల్లలు కావాలనుకుంటున్న దంపతులు.. ముందుగా అందుకు తగ్గట్లు జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీ గర్భవతి కావడానికి పురుషుడి స్పెర్మ్ ఆరోగ్యకరమైన మోతాదులో అవసరం ఉంటుంది. అది లేనప్పుడు స్త్రీ గర్భవతి కావడం అసాధ్యమవుతుంది. అందుకే.. వైద్యులు, ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు ఈ అంశంపై కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. దంపతులు తల్లిదండ్రులు కావాలంటే ముందుగా ఏం చేయాలి? ఏం పాటించాలి. అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉంటేనే స్త్రీలు త్వరగా గర్భం దాలుస్తారని, ఆ ఆరోగ్యరమైన స్పెర్మ్ కోసం పురుషులు కొన్ని నెలల ముందు నుంచే మంచి అలవాట్లను అలవరుచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఆ మంచి అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటిని పాటించాలి..

1. ఆరోగ్యకరమైన బరువు: అధిక బరువు స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గిస్తుంది. అందుకే.. ఆరోగ్యకరమైన బరువును మెయింటేయిన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

2. ఆరోగ్యకరమైన ఆహారం: ప్రతిరోజూ తినే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, జింక్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.

3. STI విషయంలో జాగ్రత్త అవసరం: క్లామిడియా, గనేరియా వంటి ఇన్ఫెక్షన్లు పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతాయి.

4. ఒత్తిడిని తగ్గించుకోవాలి: మానసిక ఒత్తిడి స్పెర్మ్ ఆరోగ్యం, కౌంట్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

5. వ్యాయామం: వ్యాయామం చేస్తుండగా. రోజూ వ్యాయామం చేయడం వల్ల స్పెర్మ్‌ను రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఎంజైమ్‌ల స్థాయిలను పెంచడంలో సహాయపడుతాయి.

6. కాటన్ బాక్సర్స్ ధరించడం: బాడీ టెంపరేచర్‌ని మెయింటేన్ చేయడానికి కాటన్ బాక్సర్స్‌ని ధరించాలి.

ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి..

1. ధూమపానం: స్మోకింగ్, వాపింగ్‌కు దూరంగా ఉండాలి. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. అనారోగ్యకరమైన స్పెర్మ్‌ ఉత్పత్తికి కారణం అవుతుంది.

2. ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి: ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

3. అలాంటి డ్రెస్సులే వేసుకోవాలి: వదులుగా ఉండే లోదుస్తులు, ఆవిరి స్నానాలు చేయాలి. వేడి నీటితో స్నానానికి దూరంగా ఉండండి.

4. ల్యాప్‌టాప్‌ని అక్కడ పెట్టుకోవద్దు: పని చేసేటప్పుడు ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవద్దు. ఇది స్పెర్మ్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

5. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి: తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు.

మరిన్ని ఆరోగ్యసంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..