Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reverse dieting: సన్నగా, నాజుగ్గా మారాలనుకుంటున్నారా? ఈ రివర్స్ డైట్ గురించి తెలుసుకోండి.. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్..

ఒక వేళ మీరు బాడీ బిల్డర్లు, బాక్సింగ్, ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాలు చేసేవాళ్లను అడిగితే వారికి బాగా తెలుస్తుంది ఈ రివర్స్ డైటింగ్ అంటే ఏమిటో. అయితే ఇప్పుడు మనకెందుకు ఈ డైట్ గురించి అని ఆలోచిస్తున్నారా? ఆగండాగండి..

Reverse dieting: సన్నగా, నాజుగ్గా మారాలనుకుంటున్నారా? ఈ రివర్స్ డైట్ గురించి తెలుసుకోండి.. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్..
Weight Loss
Follow us
Madhu

|

Updated on: Mar 04, 2023 | 7:00 PM

రివర్స్ డైటింగ్.. ఈ కాన్సెప్ట్ గురించి మీకు తెలుసా? కనీసం పేరైనా ఎప్పుడైనా విన్నారా? సాధారణంగా మీరు వినకపోయి ఉండొచ్చు. కానీ ఒక వేళ మీరు బాడీ బిల్డర్లు, బాక్సింగ్, ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాలు చేసేవాళ్లను అడిగితే వారికి బాగా తెలుస్తుంది ఈ రివర్స్ డైటింగ్ అంటే ఏమిటో. అయితే ఇప్పుడు మనకెందుకు ఈ డైట్ గురించి అని ఆలోచిస్తున్నారా? ఆగండాగండి.. ఇటీవల కాలంలో ఈ డైట్ కి బాగా ప్రాచుర్యం పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చాలా మంది చెబుతున్నారు? నిజంగా ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందా? అసలు ఈ రివర్స్ డైటింగ్ కాన్సెప్ట్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రివర్స్ డైటింగ్ అంటే..

రివ‌ర్స్ డైటింగ్ అంటే.. ఒక డైట్‌ను పాటించాక ఇంకో డైట్‌ను పాటించ‌డం అన్న‌మాట‌. ముందుగా కొన్ని నెల‌ల పాటు కఠిన ఆంక్ష‌ల‌తో కూడిన డైట్‌ను పాటిస్తారు. త‌రువాత మ‌రో డైట్‌ను పాటిస్తారు. ఇలా ఒక డైట్‌లో క‌ఠిన ఆహార నియ‌మాలు పాటించి వెంట‌నే ఇంకో డైట్‌ను మొద‌లు పెట్ట‌డం వ‌ల్ల శ‌రీరం మ‌నం తీసుకునే ఆహారం నుంచి త‌క్కువ క్యాల‌రీల‌ను మాత్ర‌మే గ్ర‌హిస్తుంది. మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. అంతేకాక శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. ఆక‌లి కంట్రోల్‌లో ఉంటుంది. దీనిని సరియైన పద్ధతిలో చేస్తే శరీర బరువు తగ్గుతుంది.

ఎలా సాయ పడుతుంది..

మీరు డైట్‌లో ఉన్నప్పుడు మీరు తక్కువ కేలరీలను తీసుకుంటారు. తద్వారా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు పోతుంది. కానీ మీ డైట్ పూర్తయ్యాక మళ్లీ అదే డైట్ ప్రకారం తింటారు. దీనివల్ల మీకు మెటాబాలిజం తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలోని కొవ్వు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రివర్స్ డైటింగ్ చాలా మేలు చేస్తుంది. ఈ రకమైన డైటింగ్‌లో శరీరంపై ఎటువంటి ప్రభావం చూపకుండా కేలరీలను తీసుకోవడం క్రమంగా పెంచుతారు.

ఇవి కూడా చదవండి

రివర్స్ డైట్ ఎప్పుడు చేయాలి?

ఎవరైనా బరువును అదుపులో ఉంచుకుని ఎక్కువ ఆహారం తినాలనుకున్నప్పుడు.. శరీరంలో మెటబాలిజం పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ డైట్ పాటించవచ్చు. ఎవరైనా ఎక్కువ కాలం తక్కువ కేలరీలు తినడం ద్వారా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే.. రివర్స్ డైట్ వారిపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఎలా చేయాలి..

దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఆహారంలో అదనంగా 100-200 కేలరీలు తీసుకోండి. అయితే ఇది ఫాస్ట్ ఫుడ్ కాకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. ఒక వారం తర్వాత.. మీ శరీరం సరిగా పని చేస్తుందో లేదో గమనించండి. ఇది ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటే.. తరువాత వారం మరో 100 కేలరీలు పెంచండి. మంచి ఆహారాన్ని తీసుకోవడం కొనసాగించండి. మీరు బరువు పెరగుతున్నట్లు అనిపిస్తే 100 కేలరీలు తగ్గించండి. ఈ విధంగా మీరు ఫిట్‌గా ఉండటానికి అంతేకాకుండా మీ బరువును నియంత్రించడానికి ఎన్ని కేలరీలు అవసరమో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..