Footwear Vastu: ఇంటి ముందు చెప్పులు ఈ విదంగా ఉండకూడదు.. పొరపాటున ఉంటే కష్టాలు తప్పవు!
మనమందరం మన ఇంటిని చక్కగా ఉంచుకోవాలనుకుంటున్నాము. అయితే మనలో కొందరికి చెప్పులు, బూట్లు అజాగ్రత్తగా వేసుకునే అలవాటు ఉంటుంది. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెప్పులు, బూట్లు ఉంచవలసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి.
చాలా మంది వాస్తు శాస్త్రంపై ఎక్కువ శ్రద్ధ చూపెడుతుంటారు. వాస్తు నిపుణుడిని సంప్రదించకుండా ఎవరూ ఎలాంటి నిర్మాణాలను ప్రారంభించరు. అదేవిధంగా ఇంటి నిర్మాణం, కార్యాలయాలు వంటి నిర్మాణాల సమయంలోనే కాదు, ఆ తర్వాత కూడా వాస్తు ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వస్తువులను సరైన స్థలంలో సరైన పద్ధతిలో ఉంచకపోతే, ప్రతికూల శక్తి మనపై ఆధిపత్యం చెలాయిస్తుంది. మన జీవితంలో ఆనందం అదృశ్యమవుతుంది. అంటే కుటుంబం క్రమంగా పేదరికం వైపు పయనిస్తుంది. అలాంటి వాస్తుశాస్త్రంలో మనం వేసుకునే చెప్పులకు సంబంధించిన నియమాలు కూడా సూచించబడ్డాయి.
మనమందరం మన ఇంటిని చక్కగా ఉంచుకోవాలనుకుంటున్నాము. అయితే కొందరు మాత్రం కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మనలో కొందరికి చెప్పులు, బూట్లు అజాగ్రత్తగా వేసుకునే అలవాటు ఉంటుంది. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెప్పులు, బూట్లు ఉంచవలసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే ఇంట్లో పాదరక్షలు, చెప్పులు తప్పుడు స్థానంలో వదిలేయడం పేదరికాన్ని ఆహ్వానిస్తుందని అంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో చెప్పులు, బూట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? బూట్లు ఎక్కడ నిల్వ చేయాలనే దాని గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ఇంటి మెయిన్ డోర్ దగ్గర చెప్పులు,బూట్లు ఎప్పుడూ ఉంచవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ దగ్గర పాదరక్షలు ఉంచరాదు. ఇంటి ప్రధాన ద్వారం పాజిటివ్ ఎనర్జీకి ప్రవేశ ద్వారం. అందుకే ఇంటి మెయిన్ డోర్ ఎప్పుడూ అందంగా, బలంగా ఉండేలా చూసేందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.. అయితే చాలా మంది ఇంటి మెయిన్ డోర్ వద్ద బూట్లు, చెప్పులు కుప్పలుగా వేస్తుంటారు. ఇది సరైనది కాదు. ఇలా చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాకను అడ్డుకున్నట్టే అవుతుంది. క్రమంగా పేదరికం మనల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఇంటి మెయిన్ డోర్ దగ్గర చెప్పులు పెట్టకుండా జాగ్రత్తపడండి.
పడకగదిలో ఎప్పుడూ చెప్పులు,బూట్లు ఉంచరాదు. ఇది అశుభం. పొరపాటున కూడా పడకగదిలో షూ రాక్ ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇంట్లో విబేధాలు తలెత్తుతాయని నమ్ముతారు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సంబంధాలు విడిపోయే స్థాయికి చేరుకుంటాయి. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కాబట్టి పడకగదిలో షూ రాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయరాదు.
ఈ దిశలో మీ బూట్లు తీయవద్దు .. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఏ దిశలో చెప్పులు, బూట్లు ఉంచాలో తెలుసుకోవాలి.. ముఖ్యంగా ఈశాన్య దిశలో పొరపాటున కూడా చెప్పులు,బూట్లు పెట్టకూడదు. ధరించకూడదు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి చితికిపోయి అప్పులపాలవుతోంది. బదులుగా, చెప్పులు, బూట్లు ఇంటికి దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచవచ్చు. చెప్పులు పెట్టుకోవడానికి ఈ రెండు దిక్కులు శుభప్రదంగా భావిస్తారు.
Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)
మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం..