AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rat Fever Symptoms : కేరళలో మరో కొత్త ఫీవర్ టెన్షన్..! ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు…

నీరు, మురుగునీటి పరిసరాల్లోకి ప్రవేశించే వారు, రక్షిత దుస్తులు, మోకాళ్ల వరకు ఉండే బూట్లు, మాస్క్ ధరించండి. నిలిచి ఉన్న నీటిలో మీ పిల్లలను ఆడుకోనివ్వకండి.

Rat Fever Symptoms : కేరళలో మరో కొత్త ఫీవర్ టెన్షన్..! ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు...
Rat Fever
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2023 | 5:59 PM

Share

కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి సిల్వర్ స్టార్మ్ వాటర్ థీమ్ పార్క్‌లో తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం వాటర్ థీమ్ పార్క్‌ను మూసివేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు త్రిసూర్ డిప్యూటీ డిఎంఓ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. మురుగునీరు చేరడం వల్ల ర్యాట్‌ఫీవర్‌ వస్తుంది. దీన్ని ముందుగానే గమనించి చికిత్స చేయకపోతే, సమస్యలు మరణానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలుక మూత్రంతో కలుషితమైన నీరు కూడా వ్యాధిని కలిగిస్తుంది. స్నానం చేసే నీటిలో ఎలుకల మూత్రం కలుషితమైతే అవి కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటి ద్వారా కూడా బ్యాక్టీరియా పెంపుడు జంతువుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. పార్కులో స్నానం చేసిన పలువురు చిన్నారులకు ర్యాట్ ఫీవర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పార్క్‌ మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

ర్యాట్‌ ఫీవర్‌ లక్షణాలు… అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం మరియు కొన్నిసార్లు జ్వరంతో చలి వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, మోకాళ్ల కింద నొప్పి, వెన్నునొప్పి, కళ్లు ఎర్రబడడం, కామెర్లు, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు తీవ్ర జ్వరంతో పాటు కామెర్లు ఉంటే, మీరు ర్యాట్‌ ఫీవర్‌గా అనుమానించాలి. పచ్చకామెర్లు కూడా ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు కలిగి ఉంటాయి. కొందరికి పొత్తికడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలా నివారించాలి? నీరు, మురుగునీటి పరిసరాల్లోకి ప్రవేశించే వారు, రక్షిత దుస్తులు, మోకాళ్ల వరకు ఉండే బూట్లు, మాస్క్ ధరించండి. నిలిచి ఉన్న నీటిలో మీ పిల్లలను ఆడుకోనివ్వకండి.

మీరు ర్యాట్‌ ఫీవర్‌ ప్రారంభ లక్షణాలను గమనించినట్లయితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. స్వీయ మందులను నివారించండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..