Bribery Case: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి లంచం కేసులో కీలక మలుపు..! రంగంలోకి ఈడీ.. ఏం జరగనుంది..?
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక,జేడీఎస్ కూడా మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
బెంగళూరు దావణగెరె జిల్లా చన్నగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడి లంచం కేసులో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసుకు సంబంధించి సమాచారం కోరింది ED. లంచం కేసులో అక్రమ డబ్బు దొరికిన నేపథ్యంలో సమాచారం కోరుతూ ED ఈ-మెయిల్ పంపింది. మీరు నమోదు చేసిన కేసు వివరాలను వెల్లడించాలంటూ ED కర్ణాటక లోకాయుక్తకు ఈ-మెయిల్ పంపింది. లంచం సమాచారం పూర్తి స్థాయిలో సేకరించిన అనంతరం లోకాయుక్త అధికారులు ఈడీకి సమాచారం అందించనున్నారు . కేసు ప్రాథమిక దర్యాప్తు నివేదికతో పాటు ఈడీకి సమాచారం అందించనున్నట్లు తెలిసింది. లోకాయుక్త నివేదికతో ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పతో పాటుగా ఆయన కుమారుడు ప్రశాంత్ కూడా ఈడీ చిక్కుల్లో పడ్డారు.
చన్నగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు అందుకున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా లోకాయుక్త ఉచ్చులో పడ్డాడు. ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు గుట్టల కోద్దీ నోట్ల కట్టలు గుర్తించారు. దాదాపు రూ. 8 కోట్ల వరకు నగదును లోకాయుక్త అధికారులు సీజ్ చేసినట్టుగా సమాచారం.
టెండర్ ఆశించిన ప్రశాంత్ మోడల్ నుండి రూ.80 లక్షలు. లంచం డిమాండ్ చేశాడు. ఇందులో 40 లక్షలు రూ. లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంటిని తనిఖీ చేసిన లోకాయుక్త అధికారులకు ఎక్కడ చూసినా డబ్బు కట్టలే కనిపించాయి. ఈ కేసుకు సంబంధించి ప్రశాంత్ మాదాల్, అతని బంధువు సిద్దేష్, అకౌంటెంట్ సురేంద్ర, డబ్బులు చెల్లించేందుకు వచ్చిన నికోలస్, గంగాధర్‌లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఐదుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించింది.
ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ ఫ్యాక్టరీ లిమిటెడ్ (కెఎస్‌డిఎల్) ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తన కుమారుడి లంచం కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. ఇక,జేడీఎస్ కూడా మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..