Viral Video: ఒక్కసారిగా బద్దలయిన భూమి.. రెండుగా చీలిపోయిన రోడ్డు..
అందరూ భూకంపం వచ్చింది ఏమో అని భయపడ్డారు. భూమి ఒక్కసారిగా చీలిపోతే ఎవరైనా అలానే అనుకుంటారు మరి.

అందరూ చూస్తుండగానే భూమి బద్దలయ్యింది. రోడ్డు రెండుగా చీలిపోయింది. సంచలన రేపిన ఈ ఘటన మహారాష్ట్ర లోని యావత్‌మాల్‌లో జరిగింది. మైందే చౌక్ నుండి ఆంగ్లో హిందీ హైస్కూల్ మార్గంలో మంచినీటి పైప్‌లైన్ బ్లాస్ట్ కావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పేలుడు ధాటికి భూమి బద్దలయ్యింది. స్కూటీపై వెళ్తున్న మహిళ ఈ ఘటనలో గాయపడింది.
భూమి రెండుగా చీలిపోవడంతో అందరూ భూకంపం వచ్చిందని భయపడ్డారు. కాని పైప్‌లైన్ బ్లాస్ట్ అయ్యిందని తరువాత నిర్ధారణ అయ్యింది. పైపులో నుంచి వందల లీటర్ల నీరు రోడ్డుపైకి రావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ఈ ఘటన అనంతరం నగరంలో సరైన నిర్వహణ లేని పైప్ లైన్ కారణంగా ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది.
यवतमाळ शहरात जमिनीत झाला स्फोट!, भूमिगत पाईपलाईन फुटली, थरकाप उडवणारा Video एकदा पाहाच…https://t.co/2jrmCKvB4K #Maharashtra #Yavatmal #Video pic.twitter.com/FCwUwIDF63
— LoksattaLive (@LoksattaLive) March 4, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




