Shocking: అసలు మనిషేనా.. కరోనా మరణాలపై కుళ్లు జోకులు.. కమెడియన్‌ను గట్టిగా ఏకిపారేస్తున్న నెటిజన్లు..
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన సుదీర్ఘ చీకటి రోజులను మర్చిపోవడం అంత ఈజీగా కాదు. లక్షలాది మందిని బలిగొన్న ఈ మహమ్మారి.. ఇప్పటికీ జనాలను హడలెత్తిస్తోంది.

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన సుదీర్ఘ చీకటి రోజులను మర్చిపోవడం అంత ఈజీగా కాదు. లక్షలాది మందిని బలిగొన్న ఈ మహమ్మారి.. ఇప్పటికీ జనాలను హడలెత్తిస్తోంది. మన దేశంలో కరోనా విలయతాండం అంతా ఇంతా కాదు. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాలెన్నో తీసుకున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. ఎందరో జీవితాలను చిన్నాభిన్నం అయ్యాయి. ఎంతోమంది చిన్నారులు, పెద్దలు అనాధలుగా మారారు.
ఇంతటి భయానకమైన రోజులను తలుచుకుంటే.. ఎవరికైనా ఇప్పటికీ గుండెదడ పుడుతుంది. గుండె లోతుల్లోంచి కన్నీరు ఉబికివస్తుంది. కానీ, సమాజంలో తనకంటూ గుర్తింపు కలిగిన ఓ కమెడియన్ మాత్రం కరోనా మరణాలపై చిల్లర కామెంట్స్ చేశాడు. మరి సమాజం ఊరుకుంటుందా? ఏకిపారేస్తోంది. అతను చేసిన నీచపు కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికంగా దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. స్టాండ్ అప్ కమెడియన్ డేనియల్ ఫెర్నాండెజ్.. తాజాగా ఓ అకేషన్‌లో మాట్లాడుతూ చిల్లర కామెంట్స్ చేశాడు.




‘కరోనా సమయంలో సోషల్ మీడియా ఒక హాస్పిటల్‌ను తలపించింది. ప్రతీ స్టోరీలో ఏదో ఒక బాధ ఉండేది. ఆక్సీజన్ కావాలి. ఐసియూ బెడ్ కావాలి. వెంటిలేటర్ కావాలి అని అడిగేవారు. కానీ, మీరు ‘చాయ్’కి ఓటు వేశారు కదా, అది తాగితే సరిపోతుంది కదా అని ఆలోచించేవాడి. సోషల్ మీడియాలో ఎవరైనా హెల్ప్ చేయమని నాకు మెసేజ్ చేస్తే.. మీరు ఎవరికి ఓటు వేశారని అడిగేవాడిని. వాళ్లు ‘చాయ్’కి ఓటు వేయలేదని చెబితే వారు చేసిన మెసేజ్, రిక్వెస్ట్‌ని షేర్ చేసేవాడిని. ‘చాయ్’కి ఓటు వేశామని చెప్పిన వారిని బ్లాక్ చేసే వాడిని.’ అంటూ చాలా చాలా ఓవర్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
డేనియల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అసలు మనిషివేనా అంటూ తూర్పారబడుతున్నారు. రాజకీయాలకు, సంక్షోభానికి ముడిపెడతావా? అంటూ దుమ్మేత్తిపోస్తున్నారు.
Thankfully, this guy is neither a doctor nor a hospital administrator., or even a good standup. The only thing he is, is a sorry excuse of a human who thinks it’s fun to get to decide eligibility of medical care based on whom the patient voted for. pic.twitter.com/zPol3pu2Qg
— Amit Thadhani (@amitsurg) March 2, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..