GAIL Jobs: గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో 126 ఉద్యోగాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
నోయిడాలోని గెయిల్ ఇండియా లిమిటెడ్.. 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
నోయిడాలోని గెయిల్ ఇండియా లిమిటెడ్.. 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, ఫైర్ అండ్ సేఫ్టీ, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్ ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. సీనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి ఆయా పోస్టును బట్టి నెలకు రూ.40,000, రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.