Fish And Milk: చేపలు తిన్న తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి హానికరమా..? దీని వెనుక నిజం ఏమిటి?

అంటే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటే ప్రాణాలకు ముప్పు ఉండదు. గతంలో తెల్లటి పదార్థాలు తింటే పురిటి నొప్పులు వస్తాయని చాలా మంది నమ్మేవారు.

Fish And Milk: చేపలు తిన్న తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి హానికరమా..? దీని వెనుక నిజం ఏమిటి?
Fish And Milk
Follow us

|

Updated on: Mar 04, 2023 | 4:07 PM

ఆహారం తినే విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ కలిసి తినకూడదని చెప్పే ఆహారాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి వాటిల్లో చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని మీలో చాలా మంది వినే ఉంటారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటీ..? అలా తింటే ఏముంది..? అన్నది ఎవరైనా ఆలోచించారా? చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, బొల్లి అనే పరిస్థితికి కారణమవుతుందని సాధారణంగా నమ్ముతారు. కానీ, ఇది పూర్తిగా అపోహా మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపలు తిన్న తర్వాత పాలు తాగడం హానికరం లేదా చర్మం పాడవుతుంది అని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు..

చేపలు, పాల ఉత్పత్తులు అధిక ప్రోటీన్ ఆహారాలు. రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీంతో గ్యాస్, డయేరియా తదితర సమస్యలు తలెత్తుతాయి. కానీ బొల్లి వంటి వ్యాధులు రాకపోవచ్చు అంటున్నారు. పైగా అనేక చేపల వంటకాలు పెరుగుతో తయారుచేస్తారు. పెరుగు ఒక పాల ఉత్పత్తి. అందువలన ఈ సిద్ధాంతం అనవసరమైనదిగా చెబుతున్నారు. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ వంటి ప్రతికూల దుష్ప్రభావాలకు దారితీయలేనప్పటికీ, ఇది స్వల్ప అజీర్ణానికి దారితీస్తుంది. కానీ అది కూడా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఇలా అవ్వాలని ఏమీ లేదంటున్నారు.

ఇక, బొల్లి అనేది అన్ని చర్మ రకాలను ప్రభావితం చేసే వ్యాధి. ఇది చర్మంలో మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం లేదా పనిచేయడం మానేసే పరిస్థితి. ఇక్కడే రంగు మారడం జరుగుతుంది. అయితే ఇది ప్రాణాపాయం లేదా అంటువ్యాధి కాదు. చికిత్సలో భాగంగా చర్మం రంగు పునరుద్ధరించబడవచ్చు, కానీ మళ్లీ రంగు మారవచ్చు.

ఇవి కూడా చదవండి

పెరుగు, చేపలు కలిపి తినకూడదని అంటారు. కానీ మెడిటరేనియన్ ఆహారం ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది చేపలు, పెరుగు,పాల ప్రధాన కలయిక. అంటే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటే ప్రాణాలకు ముప్పు ఉండదు. గతంలో తెల్లటి పదార్థాలు తింటే పురిటి నొప్పులు వస్తాయని చాలా మంది నమ్మేవారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)