Swapan Shastra: కలలో ఈ వస్తువులు కనిపిస్తే.. వారికీ అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం..
ఎక్కువమంది కలలను కేవలం కలలుగా భావిస్తారు. మరికొందరు కలలలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు. కలలో కనిపించే కొన్ని అంశాలు ఆర్ధిక ప్రయోజనాలను సూచిస్తాయని తెలుసుకుందాం.

Dreams
కలల శాస్త్రంలో కలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కలల శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలు కన్నప్పుడు అవి మంచి, చెడులు సంకేతాలుగా తెలుస్తోంది. అయితే ఎక్కువమంది కలలను కేవలం కలలుగా భావిస్తారు. మరికొందరు కలలలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు. కలలో కనిపించే కొన్ని అంశాలు ఆర్ధిక ప్రయోజనాలను సూచిస్తాయని తెలుసుకుందాం.
ఎటువంటి విషయాలు కలలలో కనిపిస్తే.. డబ్బులు లాభాలంటే..
- ఎవరి కలలోనైనా దేవత కనిపిస్తే, త్వరలో వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం, దేవుళ్ళు, దేవతలను కలలో చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇటువంటి కలలు మీ జీవితంలో త్వరలో ఆనందం రాబోతుందని ముందుగా చూస్తున్నాయని అర్ధం.
- ఎవరైనా తమ కలలో వివాహిత స్త్రీ నృత్యం చేయడాన్ని చూస్తే, మీకు ఎక్కడి నుండైనా డబ్బు వస్తుందని సంకేతం.
- కలలో రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తే, అటువంటి వారికీ త్వరలో డబ్బు వస్తుందని సూచన.
- కదంబ చెట్టు కలలో కనిపిస్తే, అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కలల శాస్త్రం ప్రకారం.. ఎవరి కలలో కదం చెట్టును చూస్తే వారు త్వరలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
- ఏ వ్యక్తి కలలో ఆవు పాలు పితుకుతున్నట్లు కనిపిస్తే, అది శుభసూచకంగా.. ప్రయోజనాలను పొందే సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.
- కలలో తామర పువ్వు , జామ చెట్టు కనిపిస్తే.. ఈ కల కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల ఇంటికి వచ్చే ఆనందం , శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను తప్పు దిశలో ఉంచుతున్నారా.. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం..

Bridal Makeup: బ్యూటీ పార్లర్లో మేకప్‌తో కాలిన ముఖం.. పెళ్లి వద్దంటూ రద్దు చేసుకున్న వరుడు

Vizianagaram: సుప్రియ గృహ నిర్భంధం కేసులో సుప్రియకు ఊరట.. ఈనెల 14 వరకు పిల్లలు తల్లి దగ్గర ఉండేలా కోర్టు తీర్పు

World Obesity Day: రోజు రోజుకీ పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య.. ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణం అంటూ హెచ్చరిక
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
