AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను తప్పు దిశలో ఉంచుతున్నారా.. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం..

వాస్తుకి విరుద్ధంగా.. వాస్తుదోషం లేదా ఏదైనా వస్తువులను తప్పు దిశలో ఇంట్లో ఉంచినట్లు అయితే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రతికూల శక్తి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. వాస్తు దోషం కారణంగా ఒక వ్యక్తి మనస్సులో ప్రతికూల భావన తలెత్తుతుంది.

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను తప్పు దిశలో ఉంచుతున్నారా.. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం..
Vastu Tips
Surya Kala
|

Updated on: Mar 04, 2023 | 10:12 AM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిలో సుఖ సంతోషాలు ఉండాలంటే ఎటువంటి వాస్తు దోషం ఉండకూడదు. ఎటువంటి వాస్తుదోషం లేని గృహాలు ఎల్లప్పుడూ ఆనందం, సానుకూల శక్తి, ఆనందం మరియు శాంతిని కలిగి ఉంటాయి. అయితే వాస్తుకి విరుద్ధంగా.. వాస్తుదోషం లేదా ఏదైనా వస్తువులను తప్పు దిశలో ఇంట్లో ఉంచినట్లు అయితే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రతికూల శక్తి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. వాస్తు దోషం కారణంగా ఒక వ్యక్తి మనస్సులో ప్రతికూల భావన తలెత్తుతుంది. అంతేకాదు ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు తరచుగా అనారోగ్యానికి గురవుతారు.

విరిగిన విగ్రహం హిందూ మతంలో విగ్రహారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం, ఒక ఇంట్లో విరిగిన దేవతా విగ్రహం లేదా చిరిగిపోయిన దేవుడి చిత్ర పఠాలు లేదా దెబ్బతిన్న బొమ్మ ఉంటే.. వెంటనే వీటిని ఇంటి నుంచి తొలిగించండి. వీటి ఇంటి బయట పవిత్ర స్థలంలో ఉంచండి. హిందూ మతంలో.. విరిగిన లేదా పగిలిన విగ్రహాన్ని పూజించడం మంచిది కాదు. వాస్తు ప్రకారం, విరిగిన విగ్రహాలను పూజించడం నిషేధించబడింది. ఇలా చేయడం వలన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో విరిగిన విగ్రహం లేదా బొమ్మ ఉంటే నదిలో నిమజ్జనం చేయాలి.

విరిగిన వస్తువులు వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పనికిరాని లేదా విరిగిపోయిన వస్తువులలో ప్రతికూల శక్తి చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, పనికిరాని వస్తువులను వెంటనే ఇంట్లో నుండి తొలగించాలి. పగిలిన వస్తువులను చాలా రోజుల పాటు నిరంతరం వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలంటి ఇంట్లో నివసించే సభ్యులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముళ్ల మొక్కలు వాస్తు ప్రకారం, పచ్చని మొక్కలను ఇళ్లలో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రభావం ఉంటుంది. కానీ ఇంటి లోపల ఎప్పుడైనా ఎండిపోయిన మొక్కలు లేదా చాలా ముళ్ళు ఉన్న మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. దీంతో ఇంట్లో టెన్షన్, రోగాలు వస్తుంటాయి.

ప్రధాన ద్వారం ముందు పూజ గది  చాలా ఇళ్లలో పూజ గది ప్రధాన ద్వారం నేరుగా ఉన్న చోట ఏర్పాటు చేసుకోవడం తరచుగా కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు గుడి ఉండకూడదు. దీని కారణంగా ఆ వ్యక్తి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి ప్రదేశంలోని పూజ గదిలో పూజ చేసినా ఆ పూజలకు తగిన పూర్తి ఫలం లభించదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్