AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korukonda: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి.. రథం చక్రాలకింద ఇరుక్కొన్ని ఇద్దరికి తీవ్రగాయాలు

భారీగా తరలివచ్చిన భక్తుల కోలాహలం మధ్య నరసింహాస్వామి రాజవీధుల్లో విహరించారు. ధర్మకర్త రంగరాజభట్టర్‌ పర్యవేక్షణలో రథం నాలుగు వీధుల మీదుగా ప్రయాణం చేసి శివాలయం, రంగనాథస్వామి ఆలయం మీదుగా నరసింహస్వామి దేవస్థానానికి చేరింది.

Korukonda: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి.. రథం చక్రాలకింద ఇరుక్కొన్ని ఇద్దరికి తీవ్రగాయాలు
Korukonda Rathotsavam
Surya Kala
|

Updated on: Mar 04, 2023 | 6:50 AM

Share

కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథం చక్రాలకింద ఇరుక్కొన్ని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అటు భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం వైభవంగా కొనసాగింది. తూర్పుగోదావరిజిల్లా గోకవరం మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడం భక్తులను విస్మయానికి గురిచేసింది. రథం ముందుకు కదులుతున్న ఆ సమయంలో రథం చక్రాల వెనుక ఇరుక్కుపోయిన ఇద్దరు భక్తుల కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఓ వ్యక్తికి పాదం మీద నుంచి రథం వెళ్లగా స్వల్పంగా గాయపడ్డాడు. మరో వ్యక్తికి ఏకంగా రెండు కాళ్లపై నుంచి రథం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచిన లక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం మధ్యాహ్నం 1.56 గంటలకు ప్రారంభమైంది. భారీగా తరలివచ్చిన భక్తుల కోలాహలం మధ్య నరసింహాస్వామి రాజవీధుల్లో విహరించారు. ధర్మకర్త రంగరాజభట్టర్‌ పర్యవేక్షణలో రథం నాలుగు వీధుల మీదుగా ప్రయాణం చేసి శివాలయం, రంగనాథస్వామి ఆలయం మీదుగా నరసింహస్వామి దేవస్థానానికి చేరింది. రథంపైకి భక్తులు అరటి పండ్లను విసిరి భక్తిని చాటుకున్నారు.

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ మాధవీలత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకున్నారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంత్రి తానేటి వనిత కొండపైకి 600 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం మొత్తం ఐదురోజులపాటు ఉత్సవాలు కొనసాగుతున్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..