Brahmotsavam: కన్నుల పండువగా వట్టెం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు.. లక్ష్మీ దేవీ అనుగ్రహం కోసం చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజలు

వట్టెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మదిలేర్మల్ మంగా సమేత వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవములు కన్నుల పండగలా నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో ప్రతిష్ట చేయబడింది.

Brahmotsavam: కన్నుల పండువగా వట్టెం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు.. లక్ష్మీ దేవీ అనుగ్రహం కోసం చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజలు
Vattem Venkateswara Swamy
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2023 | 7:02 AM

తెలంగాణ రాష్ట్ర తిరుపతిగా పేరుగాంచిన వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, బిజినాపల్లి మండలం, వట్టెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మదిలేర్మల్ మంగా సమేత వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవములు కన్నుల పండగలా నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో ప్రతిష్ట చేయబడింది. చిన్నజీయర్‌ స్వామి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఆలయ వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్ రెడ్డి. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ప్రాతఃకాలారాధన, అర్చన, సేవా కాలము, నివేదన, శాత్తుమొఱు, శాంతి పాఠం, తీర్థ ప్రసాద గోష్టి వైభవంగా జరుతున్నాయి. చతుస్థానార్చన, మూల మంత్ర హోమములు, శ్రీ సుదర్శన ఇష్టి కూడా నిర్వహిస్తున్నారు. నివేదన, పూర్ణాహుతి, బలి ప్రధానం, శాత్తు మొఱు, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక సభ్యులు ప్రతాపరెడ్డి చెబుతున్నారు.

మార్చి 3 శుక్రవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదగా మహా పూర్ణాహుతి, మహా కుంభ సంప్రోక్షణ, సామూహిక శ్రీ లక్ష్మీ నారాయణ పూజలు నిర్వహించారు. భవిష్యత్ లో వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి పరివాహక ప్రాంతం సర్వ ప్రాణి సుఖ సంతోషదాయకంగా నిలుస్తుందని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. శ్రీ మదలర్మేల్ మంగా సమేత వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉన్నాయని, ఈ ప్రాంతం దేదిప్య మానంగా వెలుగొందుతుందని శ్రీ చిన్న జీయర్ స్వామి తెలిపారు. 36 సంవత్సరాల క్రితం శ్రీ చిన్న జీయర్ స్వామి ఇక్కడ త్రిదండం స్వీకరించిన విషయం గుర్తుచేశారు. ఇక్కడ ఏమీ లేని రోజు ఎంతో కస్టపడి ఈ దేవస్థానం ఏర్పాటు చేశామని, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ దేవస్థానం అభివృద్ధి చేశామని శ్రీ చిన్న జీయర్ స్వామి తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతానికి 18 టీఎంసీ సామర్ధ్యం ఉన్న వేంకటాద్రి రిజర్వేయర్ ప్రాజెక్ట్ వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఈ ప్రాంత భూములు సస్యశ్యామలం అవుతున్నాయని చిన్న జీయర్ స్వామి అన్నారు.

ఇవి కూడా చదవండి

సంప్రోక్షణ అనంతరం తీర్ధగోష్టి నిర్వహించారు. శుక్రవారం లక్ష్మీ దేవీ అనుగ్రహం కోసం శ్రీ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో సామూహిక శ్రీ లక్ష్మీ నారాయణ పూజలు నిర్వహించారు. నారాయణడి అనుగ్రహం కావాలంటే అమ్మ వారి ఆశీస్సులు కావాలని అందుకు శుక్రవారం సరైన రోజు అని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిలో అర్చకులు, దేవస్థానం కమిటీ సభ్యులు ఎంతో ఉందని వారికీ మంగళ శాసనాలు అందజేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు