AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology Tips: జాతకంలో సూర్యుని ప్రభావం.. ఏ గ్రహంతో కలిస్తే ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయంటే

వైదిక జ్యోతిష్యం లెక్కల ప్రకారం.. సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛస్థితి.. తులారాశిలో బలహీనుడు. జాతకంలో సూర్యుని శుభ యోగం వల్ల మంచి ఉద్యోగం, వ్యాపారంలో లాభం, ఇల్లు, కారు వంటి కల నెరవేరుతుంది. అయితే సూర్యుడు, శుక్రుడు కలయిక మంచిది కాదు. సూర్యుడు మిగిలిన గ్రహాలతో ఎటువంటి సంబంధం కలిగి ఉంటాడో తెలుసుకుందాం.

Astrology Tips: జాతకంలో సూర్యుని ప్రభావం.. ఏ గ్రహంతో కలిస్తే ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయంటే
Sun In Horoscope
Surya Kala
|

Updated on: Mar 03, 2023 | 9:48 AM

Share

వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు ఒక ముఖ్యమైన గ్రహం. మొత్తం తొమ్మిది గ్రహాలకు రాజు.  ఏ వ్యక్తి  జాతకంలోనైనా సూర్య గ్రహం ప్రభావం చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు గ్రహం శక్తి, ఆత్మ, తండ్రికి కారకంగా పరిగణించబడుతుంది. జాతకంలో సూర్యుని స్థానం శుభప్రదంగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి వస్తుంది. ఏ వ్యక్తి జాతకంలో సూర్యుడు ఉఛ్చమైన, బలమైన స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో మంచి, ఉన్నత స్థానాన్ని సాధిస్తాడు. అలాంటి వారికి ప్రతి రంగంలో విజయం, గౌరవం, కీర్తి లభిస్తాయి.

ఏ వ్యక్తి జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే.. ఆ వ్యక్తికి అన్ని రకాల సౌఖ్యాలు, సంపద, కీర్తి లభిస్తాయి. కానీ మరోవైపు, స్థానిక జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే, వ్యక్తి జీవితం సమస్యల మయం. ఏ విజయం ఈజీగా దక్కదు.. ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైదిక జ్యోతిష్యం లెక్కల ప్రకారం.. సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛస్థితి.. తులారాశిలో బలహీనుడు. జాతకంలో సూర్యుని శుభ యోగం వల్ల మంచి ఉద్యోగం, వ్యాపారంలో లాభం, ఇల్లు, కారు వంటి కల నెరవేరుతుంది. అయితే సూర్యుడు, శుక్రుడు కలయిక మంచిది కాదు. సూర్యుడు మిగిలిన గ్రహాలతో ఎటువంటి సంబంధం కలిగి ఉంటాడో తెలుసుకుందాం.

సూర్యుడు-చంద్రుడు వేద జ్యోతిషశాస్త్రంలో, సూర్యుడు తండ్రికి కారకంగా పరిగణించబడగా, చంద్రుడు తల్లికి కారకంగా పరిగణించబడుతున్నాడు. సూర్యుడు .. చంద్రుని మధ్య సంబంధం రెండింటి కారకాల ప్రకారం ఫలితాలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

సూర్యుడు- అంగారకుడు సూర్యుడు.. అంగారకుడి మధ్య సంబంధం ఒక వ్యక్తిని అహంభావి చేస్తుంది. అంతే కాకుండా స్త్రీ జాతకంలో భర్తపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

సూర్యుడు- బుధుడు సూర్యుడు, బుధుడు మధ్య ఉన్న సంబంధం తండ్రి ..కొడుకుల మధ్య సంబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విధంగా ఒక వ్యక్తి  జాతకంలో పూర్వీకుల ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది.

సూర్యుడు-గురువు సూర్యునితో బృహస్పతి సంబంధం ఆత్మ సహకారాన్ని ఇస్తుంది. దీనివల్ల మనిషి మనసులో భగవంతునిపై విశ్వాసం పెరిగి ధార్మిక కార్యక్రమాల పట్ల మక్కువ పెరుగుతుంది.

సూర్యుడు-శుక్రుడు సూర్యుడు.. శుక్రుడి సంబంధం స్థానికులను ధనవంతులను, సంపన్నులను చేస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తి యొక్క సంపద పెరుగుతుంది. అయితే జాతకంలో ఈ కలయిక కారణంగా స్త్రీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

సూర్యుడు- శని వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య శనీశ్వరుల కలయిక మంచిది కాదు. ఇది పితృ దోషాన్ని సృష్టిస్తుంది. తండ్రి .. కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది.

సూర్యుడు- రాహువు సూర్యుడు, రాహువు కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. దీంతో బంధుత్వాల్లో గొడవలు, చీలికలు ఏర్పడతాయి.

సూర్యుడు – కేతువు సూర్యుడు .. కేతువుల సంబంధంతో.. వ్యక్తి మతపరమైన స్వభావం కలిగి ఉంటాడు. అంతేకాదు ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడుతుందో.. వారికి మాతృ పక్షం నుండి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్