Holi 2023: ఈ క్షేత్రంలో రేపే హొలీ.. చితి మధ్యలో, చితాభస్మంతో భిన్నంగా హొలీ జరుపుకునే శివయ్య భక్తులు

ఈ క్షేత్రంలో శివయ్య భక్తులు విభిన్నంగా హొలీ జరుపుకుంటారు. ఇక్కడ పూలు, రంగులు లేదా గులాల్‌లను ఉపయోగించరు. వీటికి బదులుగా.. శివయ్య భక్తులు  శ్మశాన వాటికలోని చితితో హోలీ ఆడతారు.

Holi 2023: ఈ క్షేత్రంలో రేపే హొలీ.. చితి మధ్యలో, చితాభస్మంతో భిన్నంగా హొలీ జరుపుకునే శివయ్య భక్తులు
Masan Holi 2023
Follow us
Surya Kala

|

Updated on: Mar 03, 2023 | 11:23 AM

హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది హొలీ పండగ మార్చి 8వ తేదీన హొలీ పర్వదినం జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు రెడీ అవుతున్నారు. రంగుల రంగులను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కాశీలో ఆడే హోలీ జరుపుకునే తేదీ.. రంగు దేశం.. కాదు ప్రపంచంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. విశ్వనాథుడు కొలువైన క్షేత్రంలో శివయ్య భక్తులు విభిన్నంగా హొలీ జరుపుకుంటారు. ఇక్కడ పూలు, రంగులు లేదా గులాల్‌లను ఉపయోగించరు. వీటికి బదులుగా.. శివయ్య భక్తులు  శ్మశాన వాటికలోని చితితో హోలీ ఆడతారు. ఈ సంవత్సరం ఈ ప్రత్యేకమైన హోలీని ఏకాదశి రెండవ రోజు అనగా 04 మార్చి 2023న వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో ఉదయం 11:30 గంటలకు ఆడతారు. అంటే బనారస్‌లో హోలీ ప్రారంభం ఫాల్గుణ పూర్ణిమకు ముందు వచ్చే రంగభరి ఏకాదశి నుండి జరుపుకుంటారు. మహాదేవుడు కొలువైన పురాతన నగరమైన కాశీలో.. కాలుతున్న చితిల మధ్య హోలీని ఎందుకు ఆడతారు? దీనికి మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి? ఈ సంప్రదాయం గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం వారణాసిలో హోలీ పండుగ ఐదు రోజులు ముందు నుంచి హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి.ఈ ఏడాది కూడా వారణాసిలో రేపటి నుంచి హోలీ వేడుకలు ప్రారంభంకానున్నాయి. కాశీలోని పార్వతీ పరమేశ్వరుడి విగ్రహాలపై భక్తులు రంగులు జల్లి హోలీ వేడుకలను నిర్వహించుకుంటారు.

అయితే కొందరు ఇక్కడ చితాభస్మంతో హొలీ వేడుకలను జరుపుకోవడానికి ఒక కథ వినిపిస్తోంది. తన భక్తుడైన అఘోరీ ఎప్పుడు నిరుత్సాహంగా ఉండడం చూసిన శివయ్య.. అతని దుఃఖాన్ని తొలగించాలనుకున్నాడు. దీంతో శివుడు మరుసటి రోజు తన భక్తుడైన అఘోరీ దుఃఖాన్ని తొలగించడానికి తన మొత్తం బృందంతో శ్మశాన వాటికకు చేరుకుంటాడు.. అక్కడ తన భక్తులు.. శివ గణాలతో కలిసి శివయ్య.. మండుతున్న చితి మధ్యలో, చితి బూడిదతో హోలీ ఆడాడట.

ఇవి కూడా చదవండి

నాటి నుండి నేటి వరకు ఈ హోలీ సంప్రదాయం వారణాసిలో కొనసాగుతుంది. శ్మశానవాటికలో తమ సన్నిహితులకు, బంధువులకు కన్నీరు మధ్య తుది వీడ్కోలు చెబుతున్న బంధువులను చూస్తూ ఉంటారు. అయితే రంగభరి ఏకాదశి రోజున మాత్రం ఇక్కడ అందుకు భిన్నంగా ఉంటుంది కనిపించే దృశ్యం.. ఈ రోజున.. శివయ్య భక్తులు..  మండుతున్న చితి మధ్య  పాడుతూ, నృత్యం చేస్తూ, భక్తిలో మునిగి తేలుతూ.. ఒకరిపై ఒకరు బూడిద జల్లుకుంటూ.. హొలీ ఆడుకోవడం కనిపిస్తుంది.

శ్మశానవాటికలో హోలీ మతపరమైన ప్రాముఖ్యత హిందువులు కాశిని మోక్ష నగరంగా భావిస్తారు. ఇక్కడ చేరుకొని మరణిస్తే.. పునర్జమ్మ ఉండదని విశ్వాసం. ఇక్కడ రంగభరి ఏకాదశి రోజున శ్మశాన వాటికలో ఆడే హోలీకి చాలా మతపరమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడి చితా భస్మంతో హోలీ ఆడటం వల్ల మానవ జీవితానికి పరమ సత్యంగా చెప్పబడే మృత్యుభయం తొలగిపోతుందని నమ్ముతారు. కాశీ విశ్వనాథుడు తన భక్తులపై అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తాడని.. ఏడాది పొడవునా వారికీ ఏర్పడే అన్ని రకాల అడ్డంకుల నుండి సురక్షితంగా ఉంచుతారని విశ్వాసం. భూత ప్రేతాల నుంచి రక్షణ ఉంటుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ