Telangana: లక్షకు రూ.9వేలు వడ్డీ ఆశ చూపించి భారీ వసూలు.. రూ.35 కోట్లతో కేటుగాళ్లు పరారీ.. ఎక్కడంటే..

లక్ష రూపాయలు పెట్టుబడి...నెలకు 9 వేలు వడ్డీ ఇస్తాం..! ఇదీ ఓ అనామక పేరుతో ఉన్న కంపెనీ ప్రకటన. అధికవడ్డీ ఆశతో జనం భారీగా పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు కేటుగాళ్లు.

Telangana: లక్షకు రూ.9వేలు వడ్డీ ఆశ చూపించి భారీ వసూలు.. రూ.35 కోట్లతో కేటుగాళ్లు పరారీ.. ఎక్కడంటే..
Cheating In Rangareddy
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2023 | 6:30 AM

రంగారెడ్డిజిల్లాలో ఘారానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీ ఆశచూపి కేపీడబ్ల్యూ క్రిప్టో కంపెనీ, ఈ స్టోర్ ఇండియా పేరుతో కొందరు వ్యక్తులు జనాల నుంచి భారీగా డబ్బులు దండుకున్నారు. యాచారం మండల కేంద్రానికి చెందిన సుఫియాన్, అతడి సోదరులు పెట్టుబడుల పేరుతో ఈ డబ్బులు వసూలు చేశారు. లక్ష రూపాయలకు నెలకు 9 వేలు వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. ఇలా వందాలది మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. తొలుత కొందరికి నెలవారీ వడ్డీ చెల్లించడంతో మిగిలిన వారు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఒక్క యాచారం మండలమే కాదు, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెందిన వారితోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. మరి కొందరు అప్పుచేసి సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. బాధితుల నుంచి…నిందితులు దాదాపు 35 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల నెలవారీ చెల్లింపులు నిలిచిపోవడంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు..పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన యాచారం పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు. తమను నమ్మించి మోసం చేశారని బాధితులు వాపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..