AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వ కాలేజీలో దయనీయ స్థితి.. 700 మంది బాలికలకు ఒకటే మూత్రశాల

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Telangana: ప్రభుత్వ కాలేజీలో దయనీయ స్థితి.. 700 మంది బాలికలకు ఒకటే మూత్రశాల
Government Junior College
Surya Kala
|

Updated on: Mar 03, 2023 | 8:29 AM

Share

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో దయనీయ స్థితి నెలకొంది. ప్రభుత్వ కళాశాల లో కనీస వసతులు కరువయ్యాయి. దాదాపు 700 మంది విద్యార్థినులకు ఒక్కటే మూత్రశాల ఉండడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాల లేక అనేక అవస్థలు పడుతున్నారు. తమకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలంటూ..  గత కొన్ని నెలలుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే కాలేజీలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలంటూ.. అధికారులకు స్టూడెంట్స్ పలు మార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు స్పందన కరువు అయింది. దీంతో స్టూడెంట్స్.. క్లాసులు బహిష్కరించి భారీ నిరసన చెప్పట్టారు.

ఈ నేపథ్యంలో ఎల్ఎల్బి విద్యార్థి మనిదీప్..విద్యార్ధుల సమస్యలను హై కోర్టుకు లేఖ రాశారు.  ఈ సమస్యలపై రాసిన లేఖను హై కోర్టు విచారణకు తీసుకుంది. అంతేకాదు.. ప్రభుత్వ కాలేజీ లో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉందటమా అంటూ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

తక్షణమే ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించింది. ఈమేరకు సీఎస్‌, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 25లోగా విద్యాసంస్థల్లోని వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..