Success Story: భర్త హఠాన్మరణంతో పసుపు పరిశ్రమని చేపట్టి.. కోట్ల టర్నోవర్‌కి చేర్చిన సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ సునీత

అన్యోన్యంగా కుటుంబంతో సాగుతున్న వీరి కుటుంబంలో కరోనా కల్లోలం రేపింది.. 2021 మే లో భర్త వెంకటకృష్ణ సడెన్ గా కరోనాతో కన్నుమూశారు.. దీంతో ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న కుటుంబం ఓ వైపు, వ్యాపారం మరో వైపు ఎలా నెట్టుకురావాలో అర్థం కాలేదు.. ఢీలా పడింది.. కొద్ది రోజులు ఇంటికే పరిమితమైంది సునీత.

Success Story: భర్త హఠాన్మరణంతో పసుపు పరిశ్రమని చేపట్టి.. కోట్ల టర్నోవర్‌కి చేర్చిన సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ సునీత
Sunitha
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2023 | 8:06 PM

ఇతర రాష్ట్రాలకే కాదు, ఇతర దేశాలకు సైతం తమ ఉత్పత్తులను ఎక్స్ పోర్ట్ చేస్తూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్న సమయంలో భర్త హఠాన్మరణం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. కొద్దిరోజులు ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదు.. ఏమి చేయాలో పాలుపోలేదు.. ఇంటికే పరిమితమయ్యింది. తమను నమ్ముకున్న కార్మికులు, మధ్యలో నిలిచిన వ్యాపారం, రెండు దశాబ్దాల కష్టం, అంతకు మించి భర్త ఆశయం ఇలా ఎన్నెన్నో ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి.. తన భర్త మరణించలేదు, తనలోనే ఉన్నాడన్న ఆత్మవిశ్వాసం తో మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్లీ వ్యాపారం వైపు అడుగులు వేసింది. అంతే మరి తిరిగి చూడలేదు.. కొద్ది నెలల్లోనే అందరినీ ఆశ్చర్యపరిచేలా తన భర్త ఇచ్చిన వ్యాపార రంగాన్ని రెండింతలు చేసి అందరితోనూ ప్రశంసలను అందుకున్నారు. కష్టాలకు కుంగిపోకుండా.. విజయమే తన లక్ష్యం అంటూ విజయపథం వైపు దూసుకుపోతున్న సక్సెస్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్  నిలిచారు సునీత.

అన్నాడి సునీత.. ఒకప్పుడు సాధారణ గృహిణి.. ఇప్పుడు తాను నిర్వహిస్తున్న పసుపు వ్యాపార రంగంలో ఒక బ్రాండ్.. అంతేకాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి ఉపాధి కల్పిస్తున్న సక్సెస్ పుల్ ఎంట్రపెన్యూర్.  కోట్ల రూపాయల టర్నోవర్.. దేశ, విదేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతులతో దూకుడుగా ముందుకు వెళ్తున్న మహిళ బిజినెస్ పర్సనాలిటీ. ఇంత సక్సెస్ వెనుక ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సవాళ్లు అంతకు మించి విధి మిగిల్చిన అంతులేని విషాదం. అయినా దేనిలోనూ తాను తక్కువ కాదు అన్న  ప్రాధమిక సూత్రంతో ముందుకు సాగుతుంది.. 2000 సంవత్సరంలో సునీత ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే చెన్నై కి చెందిన అన్నాడి వెంకటకృష్ణ అనే వ్యక్తితో వివాహమైంది. దీంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికే పరిమితమైంది సునీత.

వెంకట కృష్ణ తండ్రి  చెన్నై లో పసుపు బిజినెస్ చేస్తూ ఉంటారు. దీంతో తాను కూడా తండ్రి బాటలో పయనిస్తూ అదే బిజినెస్  చేయాలని భావించాడు వెంకటకృష్ణ. అందులో భాగంగా నాణ్యమైన పసుపు సేకరణ కోసం ఆరా తీశాడు.. అలా విశాఖ, విజయనగరం ఏజెన్సీలో నాణ్యమైన పసుపు పంట పండుతుంది అని తెలుసుకున్నారు. దీంతో సాలూరు కేంద్రంగా తమకు అవసరమైన పసుపుపొడి తయారీ వైపు దృష్టి సారించి 2005 లోనే వ్యాపారం ప్రారంభించారు భర్త వెంకటకృష్ణ. వ్యాపారంప్రారంభించిన కొత్తలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. పసుపు కొమ్ములు ఏజెన్సీలోని రైతుల దగ్గర.. సంతలకు వెళ్లి పసుపు కొమ్ములను కొనుగోలు చేసేవారు. మొదట కొద్దిపాటి పెట్టుబడి, కేవలం ఐదుగురు కూలీలతో పనులు ప్రారంభించారు. భర్త ముడి సరుకు కొనుగోలు చేస్తే సునీత ఆర్గానిక్ పసుపు పొడి తయారీపై దృష్టి సారించింది. .

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆగిపోయిన చదువును కొనసాగిస్తూ.. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్ఏ, ఎమ్ బీఏ పూర్తి చేశారు. ఓ వైపు చదువు, మరో వైపు పసుపు పొడి తయారీని చూస్తూ కాలం గడిపారు. అలా 2005లో ఒక కుటీర పరిశ్రమగా ప్రారంభమైన వ్యాపారం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. లేఖ్య ఎంటర్ ప్రైజెస్ పేరుతో పసుపుతో పాటు, కుంకుమ, మసాలా పౌడర్స్ కూడా తయారుచేసి విశేష ఆదరణ పొందారు వెంకట కృష్ణ దంపతులు. వీరు తయారు చేసే ఉత్పత్తులన్నీ పూర్తిగా ఆర్గానిక్ కావటంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం వీటికి మంచి గిరాకీ వచ్చింది. కేరళ, చెన్నై లలో ప్రఖ్యాతిగాంచిన పలు దేవాలయాల్లో వీరు తయారు చేసిన పసుపు, కుంకుమలనే పూజా కైంకర్యాలకు వాడేవారు..

క్షేత్రస్థాయి నుంచి కష్టపడి పారిశ్రామికవేత్తగా ఉన్నత స్థానానికి చేరుకుంటున్న సమయంలోనే కాలం వీరిని చూసి ఓర్చుకోలేక పోయింది.. అన్యోన్యంగా కుటుంబంతో సాగుతున్న వీరి కుటుంబంలో కరోనా కల్లోలం రేపింది.. 2021 మే లో భర్త వెంకటకృష్ణ సడెన్ గా కరోనాతో కన్నుమూశారు.. దీంతో ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న కుటుంబం ఓ వైపు, వ్యాపారం మరో వైపు ఎలా నెట్టుకురావాలో అర్థం కాలేదు.. ఢీలా పడింది.. కొద్ది రోజులు ఇంటికే పరిమితమైంది సునీత.

పసుపు తయారీ కేంద్రానికి పరిమితమైన సునీత కు ముడి సరుకుల కొనుగోలు, తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాలు వంటివి ఏమితెలిసేవి కావు. అన్నీ భర్త వెంకట కృష్ణ చూసుకోవడంతో లావాదేవీల వ్యవహారం కూడా తెలిసేది కాదు.. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీ పరిస్థితి ఒక్కసారిగా సంగ్ధిధంలో పడింది.. భర్త లేని భాధతో పాటు అకస్మాత్తుగా అయోమయంలో పడ్డ వ్యాపారం ఈమెను కుంగదీసింది. అలాంటి సమయంలోనే తల్లిదండ్రులు సునీతకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. మేమున్నామంటూ ప్రోత్సహించారు..

భర్త వెంకటకృష్ణ ఆశయం తో పాటు కంపెనీ మీద బ్రతుకుతున్న రెండు వందల మంది జీవనం ప్రశ్నార్థకం కాకూడదు అని నిర్ణయించుకుంది.. వ్యాపార రంగంలో మళ్ళీ తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అలా తిరిగి ప్రారంభమైన వ్యాపార జీవితంలో మహిళగా ఎన్నో ఆటుపోట్లు, కష్ట నష్టాలు ఎదురయ్యాయి. ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకుని పరిస్థితులను ఎదురీదుతూ ముందుకు సాగింది.  తమ బిజినెస్ నెట్ వర్క్ డెవలప్ చేసుకుంది. తన భర్త చేసిన వ్యాపారాన్ని తక్కువ సమయంలోనే రెండింతలు చేసి మానసికంగా కుంగదీసిన పరిస్థితులకు సమాధానం చెప్పింది.

భర్త ఆశయమే తన లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్న సునీత కు గమ్యం అతి చేరువలోకి వచ్చింది. అందుకోసం నిరంతరం కష్టపడుతోంది. అలా తన ఉత్పత్తులు ప్రతి ఇంటికి చేరుకోవడానికి సునీత పడుతున్న తపన చూసిన వారు సునీత ఒక స్ట్రాంగ్ అండ్ సక్సెస్ ఫుల్ ఉమెన్ అని కొనియాడుతూ అండగా నిలుస్తున్నారు.

Reporter: Koteswararao

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ