Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP-Telangana: అసలే హార్ట్ అటాక్స్ కాలం.. ఈ మాంసం తిని.. ఈ పాలు తాగితే మనిషి అన్నోడు బ్రతుకుతాడా..?

ప్రజంట్ సొసైటీలో కల్తీ సరుకు రాజ్యమేలుతుంది. ఏది తినాలన్నా.. ఏది తాగాలన్నా కల్తీనే. టీ నుంచి తినే అన్నం వరకు అంతా కల్తీ మయం.

AP-Telangana: అసలే హార్ట్ అటాక్స్ కాలం.. ఈ మాంసం తిని.. ఈ పాలు తాగితే మనిషి అన్నోడు బ్రతుకుతాడా..?
Adulterated Milk Meat
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 06, 2023 | 3:30 PM

ఉప్పు..పప్పు..పాలు..పిండి..కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులను కల్తీ చేస్తూనే ఉన్నారు..తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఇదే జరిగింది..ఒకచోట కల్తీ పాలు అయితే.. మరోచోట కల్తీ మాంసం..ఇలా తినేవి తాగేవి కల్తీ అయితే సామన్య ప్రజల పరిస్థితి ఏంటీ..??? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తిరుపతి జిల్లా గూడూరులో మాంసం దుకాణాలపై దాడులు జరిగాయి.భారీగా నిల్వ ఉంచిన, కుళ్లిన మటన్‌ను స్వాధీనం చేసుకున్నారు మున్సిపల్ కమిషనర్..ఈ మాంసాన్ని హోటల్స్‌కు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు నిర్వాహకులు..బయట పొట్టేలు మాంసాన్ని ఉంచి లోపల గొర్రె మాంసం అమ్మకాలు చేస్తోందీ మటన్ మాఫియా.

ఏపీ వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి..మాంసం, చేపల విక్రయాల మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు..ఇప్పటికే 208 మంది వ్యాపారులపై కేసు నమోదు చేశారు…అలాగే రెండు నెలల వ్యవధిలో 2000 kgల పైనే సీజ్ చేశారు అధికారులు.. అటు పాలు కూడా కల్తీ అవ్వుతున్నాయి..ఇందుకు భువనగిరి జిల్లా సాక్ష్యంగా నిలిచింది..

అటు యాదాద్రి జిల్లాలో భువనగిరి ఎస్ఓటి అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు.. చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో పాలకేంద్రంపై దాడులు చేశారు..ఇందులో 110 లీటర్ల కల్తీ పాలు, లీటర్ హైడ్రోజెన్ పేరాక్సైడ్, 14 కిలోల మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. బాలం శేఖర్ అనే పాల వ్యాపారినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..