AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Vs TDP: ముప్పాళ్లలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం.. బాహాబాహీకి దిగిన ఇరుపార్టీల కార్యకర్తలు

ఆ ప్రాంతంలో అప్పటివరకు తిరునాళ్ల సందడి వాతావరణం ఉండేది. అయితే ప్లెక్సీల ఏర్పాటుతో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. అధికార, ప్రతి పక్ష పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఓ రేంజ్ లో కొట్టుకున్నారు.

YCP Vs TDP: ముప్పాళ్లలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం.. బాహాబాహీకి దిగిన ఇరుపార్టీల కార్యకర్తలు
Ycp Vs Tdp
Surya Kala
|

Updated on: Mar 09, 2023 | 6:58 AM

Share

ఫ్లెక్సీ ఫైట్. ఇది ఏపీ పాలిటిక్స్‌లో లేటెస్ట్‌ ట్రెండ్. సందర్భం ఏదైనా ఫ్లెక్సీలు చింపుకోవడం.. రచ్చ రాజేయడం కామన్‌గా మారిపోయింది. ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలంలో జరిగిన గొడవ ఇది. ముప్పాళ్ల తిరునాళ్లలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం తారస్థాయికి చేరింది. ఎంతలా అంటే నడిరోడ్డుపై పరస్పరం కలబడేంతగా. బ్యానర్ల విషయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

ఎప్పుడూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసే చోట టీడీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇంకేముంది. తెలుగు తమ్ముళ్ల ఫ్లెక్సీని పట్టపగలే పరపరా చింపేశారు వైసీపీ కార్యకర్తలు. తమ బ్యానర్లను చింపేశారంటూ టీడీపీ వాళ్లు మాత్రం తక్కువ తిన్నారా. తీవ్ర ఆగ్రహావేశాలతో.. వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్యానర్‌ను చించేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు, వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫోటోలున్న బ్యానర్లు పీస్‌లు పీస్‌లు అయిపోయాయి.

ఫ్లెక్సీలు చించుకోవడంతో ఈ గొడవ ఆగలేదు. పరస్పరం కొట్టుకుందాం రా అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. కార్యకర్తల సవాళ్లు, అరుపులతో సీన్‌ రణరంగాన్ని తలపించింది. వైసీపీ, టీడీపీ కేడర్‌ మధ్య తోపులాట జరిగింది.  రెండు పార్టీల కార్యకర్తలు ఎంతకూ వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. మరోసారి ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..