AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Tiger: అర్ధరాత్రి అడవిలో ఆపరేషన్‌ టైగర్‌.. మూడురోజులైనా తెలియని తల్లిజాడ.. తల్లి పులిని.. పులి కూనలను కలిపే ప్రయత్నం

శ్రీశైలం–నాగార్జున సాగర్‌ పులుల అభయారణ్యంలో 4 ఆడ పిల్లలను ఈనిన ‘టీ108’ అనే పెద్దపులి వాటికి దూరమై 3 రోజులు గడిచిపోయింది. మరో వైపు తల్లీ బిడ్డల పునరేకీకరణ (రీయూనియన్‌)కు అటవీ అధికారులు పూర్తిగా శ్రమిస్తున్నారు. 300 మంది నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ సిబ్బంది, అధికారులు విడతల వారీగా ఫుట్‌ పేట్రోలింగ్‌ చేస్తున్నారు.

Operation Tiger: అర్ధరాత్రి అడవిలో ఆపరేషన్‌ టైగర్‌.. మూడురోజులైనా తెలియని తల్లిజాడ.. తల్లి పులిని.. పులి కూనలను కలిపే ప్రయత్నం
Abandoned Cubs
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2023 | 7:15 AM

ఆపరేషన్ టైగర్ T-108 కీలక ఘట్టానికి చేరుకుంది. తప్పిపోయిన తల్లి పులి..పిల్లల కోసం అడవిలో సంచిస్తూనే ఉంది.దీంతో పెద్దపులిని పులికూనలను కలిపేందుకు అటవీ శాఖ అధికారులు అర్ధరాత్రి ఆపరేషన్‌ స్టార్ట్‌ చేశారు. ఆత్మకూరు అటవీశాఖ గెస్ట్ హౌస్ లో ఉన్న నాలుగు పులికూనలను గంపలో పెట్టి..వాటిని కారులో తీసుకొని అర్ధరాత్రి అడవిలోకి వెళ్లారు. వాళ్లతో పాటు టీవీ9 కూడా వెళ్లింది. ముసలిమడుగు గ్రామం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో పులికూనలను… తల్లి పులిని కలిపేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

అడవిలో పెద్ద పులి… అడవి బయట పులి కూనలు.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుగా ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. తల్లి ప్రేమ కోసం పిల్లలు ఆరాటపడుతున్నాయి. బిడ్డల కోసం తల్లి తల్లడిల్లిపోతోంది. కూనల కోసం అడవంతా జల్లెడ పడుతోంది. ప్రేమ ఎవరిలోనైనా ఒకటే… అది జంతువులైనా.. మనుషులైనా .. తల్లి ప్రేమను మించింది మరేది లేదు.. అటువంటి తల్లి ప్రేమ పంచడానికి పెద్ద పులి.. అమ్మ చెంతకు చేరడానికి పులి కూనలు మూడ్రోజులుగా పడుతున్న వేదన వర్ణనాతీతం.. అందుకే..తల్లీ బిడ్డలను కలిపేందుకు..అటవీశాఖాధికారులు పూనుకున్నారు.

ఇదో బిగ్‌ టాస్క్‌ అయినా.. మిడ్‌నైట్‌ అని కూడా చూడలేదు.. పులికూనలను గంపలో పెట్టారు. కారులో తీసుకెళ్లారు. పెద్ద పులి అడుగు జాడలున్న చోటంతా తిరిగారు..వీరితో పాటు.. ప్రాణాలకు తెగించి డేరింగ్‌ రిపోర్టింగ్‌ చేసింది టీవీ9 టీమ్‌.  అడవిలో ఈ నాలుగు పులి పిల్లలను వదిలి పులి కూనల అరుపులతో కృత్రిమ శబ్దాలు చేస్తూ పెద్దపులిని అక్కడికి రప్పించేందుకు ప్రయత్నం చేశారు..

మూడు రోజులు గడిచినా పెద్ద పులి జాడలేకపోవడంతో.. తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 70 ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు ఏర్పాటు చేసి.. 200 సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ లతో కూడా పర్యవేక్షిస్తున్నారు.

బుధవారం పెద్ద పులి అడుగుజాడలు కనిపించాయి. కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ సమీపాన అచ్చిరెడ్డి కుంట సమీపంలో గొర్రె కాపర్లకు పెద్దపులి కనపడింది. రోడ్డు దాటుతుండగా..కాపర్లు కేకలు వేయడంతో.. పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది. పులి కనపడిన ప్రదేశానికి వెళ్లి అటవీశాఖ అధికారులు పరిశీలించారు. రాత్రంతా అక్కడే తిరిగారు.

పులి కూనలు కనిపించిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో.. పెద్ద పులి గ్రామస్తులకు కనపడింది. ఎలాగైనా వాటిని కలపాలని..ప్రయత్నిస్తున్న అధికారుల శ్రమ ఫలిస్తుందా..అడుగడుగునా టెన్షనే..అయినా అధికారులు వదలడం లేదు. టీవీ9 కూడా వారితోనే ఉంది.. ఇవాళైన పులి కూనలు తల్లి దగ్గరకు చేరుకుంటాయా..చూడాలి మరి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పహల్గామ్‌ ఉగ్రదాడిపై RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఘాటు వ్యాఖ్యలు!
పహల్గామ్‌ ఉగ్రదాడిపై RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఘాటు వ్యాఖ్యలు!
యుద్ధ భయం.. బంకర్లు శుభ్రం చేసుకుంటున్న కశ్మీర్‌ ప్రజలు!
యుద్ధ భయం.. బంకర్లు శుభ్రం చేసుకుంటున్న కశ్మీర్‌ ప్రజలు!
పోస్ట్ ఆఫీస్‌లో ఈ ప్రత్యేక అకౌంట్‌ గురించి మీకు తెలుసా?
పోస్ట్ ఆఫీస్‌లో ఈ ప్రత్యేక అకౌంట్‌ గురించి మీకు తెలుసా?
భారత రోడ్లపైకి మళ్లీ ఆ ఐకానిక్ బైకులు.. రిలీజ్ ఎప్పుడంటే?
భారత రోడ్లపైకి మళ్లీ ఆ ఐకానిక్ బైకులు.. రిలీజ్ ఎప్పుడంటే?
విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు..హిందువునని చెప్పగానే!
విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు..హిందువునని చెప్పగానే!
అధిక ప్రేలాపనలు పేలుతున్న పాకిస్థానీలు..!
అధిక ప్రేలాపనలు పేలుతున్న పాకిస్థానీలు..!
ఈ పాల ప్రాడక్ట్‌తో క్యాన్సర్ రిస్క్.. వారికే ఎక్కువ ముప్పు
ఈ పాల ప్రాడక్ట్‌తో క్యాన్సర్ రిస్క్.. వారికే ఎక్కువ ముప్పు
ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే కోటి రూపాయలు..అద్భుతమైన స్కీమ్స్‌!
ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే కోటి రూపాయలు..అద్భుతమైన స్కీమ్స్‌!
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత.. మధ్యలోకొచ్చిన మరో ముస్లిం దేశం!
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత.. మధ్యలోకొచ్చిన మరో ముస్లిం దేశం!
మరో భారీ కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు!
మరో భారీ కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు!