AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచిన దర్యాప్తు సంస్థలు.. మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించిన ఈడీ అధికారులు

లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియాను ఫిభ్రవరి 27న సీబీఐ అరెస్ట్‌ చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌పై ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచిన దర్యాప్తు సంస్థలు.. మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించిన ఈడీ అధికారులు
Manish Sisodia
Janardhan Veluru
|

Updated on: Mar 09, 2023 | 3:03 PM

Share

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి.  మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను ఈడీ మరోసారి విచారించారు. తీహార్‌ జైల్లో ఉన్న సిసోడియాను ఈడీ అధికారులు గురువారంనాడు ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి.  ఈనెల 7వ తేదీన కూడా మనీష్‌ సిసోడియాను ఈడీ విచారించింది. లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియాను ఫిభ్రవరి 27న సీబీఐ అరెస్ట్‌ చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌పై ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. లిస్కర్ స్కామ్ కేసులో అరెస్టు కావడంతో సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఛార్జ్‌షీట్‌లో ఉన్న ఆరోపణలపై సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల ధ్వంసంపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రశ్నిస్తున్నారు.

కాగా సిసోడియాను కరుడు గట్టిన నేరగాళ్లతో కలిపి జైల్లో ఉంచారంటూ ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భట్టాచార్య అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన అనుమతులను జైలు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. జైలు అధికారుల నిర్ణయం వెనుక కేంద్ర పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే జైలు అధికారులు ఆప్ నేతల ఆరోపణలను తోసిపుచ్చారు. జైలు రూల్స్ మేరకే సిసోడియాకు జైల్లో వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు జైల్లో సరైన భద్రత కల్పించినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ రేపు కోర్టులో విచారణ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

Follow Us
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్