PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..
ఆస్ట్రేలియాలో హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతుండటాన్ని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. రెండోరోజున భారత్ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ముందు- రెండుదేశాల సంబంధాలపై చర్చ జరిగింది.
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా కరాఖండీగా తాను చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టారు ప్రధాని మోదీ. ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు తమను ఎంత బాధపెడుతున్నాయో చెప్పారు మోదీ. అయితే ఇకనుంచైనా దాడులు ఆగుతాయా అన్నదే అసలైన పాయింట్.
ఆస్ట్రేలియాలో హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతుండటాన్ని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. రెండోరోజున భారత్ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ముందు- రెండుదేశాల సంబంధాలపై చర్చ జరిగింది. ఆస్ట్రలేయాలోని హిందూ ఆలయాలపై దాడులు తమ కలవరుస్తున్నాయని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
అదేసమయంలో ఆస్ట్రేలియాలోని భారతీయ భద్రత తమకు ప్రాధాన్యమని ఆల్బనీస్ చెప్పినట్లు మోదీ వివరించారు. అయితే ఈ అంశంపై ఆల్బనీస్ వెంటనే స్పందించలేదు. అయితే సమగ్ర ఆర్థిక ఒప్పందాన్ని పూర్తిచేసుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ చెప్పారు. అలాగే రెండుదేశాల మధ్య ఆడియో విజువల్ సహకార ఒప్పందంపై చర్చ జరిగింది. స్కిల్డ్ జాబ్స్, సాంస్కృతిక, సృజనాత్మక సహకారం పరస్పరం అందించడమే ఈ ఒప్పంద ఉద్దేశం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..