H3N2 Virus: ఇన్ ఫ్లూయెంజా ప్రభావం వీరిపై అధికం.. ఎప్పటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటే..

రెండోది రుతుపవనాల అనంతర కాలంలో  సీజనల్ ఇన్ ఫ్లూయెంజా వల్ల వచ్చే కేసులని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజృంభిస్తున్న హాంకాంగ్ ఫ్లూ.. H3N2 వైరస్ మార్చి నెలాఖరు నుంచి తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ హాంకాంగ్ ఫ్లూ వైరస్‌ల వల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది.

H3N2 Virus: ఇన్ ఫ్లూయెంజా ప్రభావం వీరిపై అధికం.. ఎప్పటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటే..
H3n2 Influenza
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2023 | 10:14 AM

కరోనా సృష్టించిన బీభత్సంనుంచి ఇంకా తేరుకోక ముందే.. దేశంలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ విజృంభిస్తోంది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌, ఎనిమిది హెచ్1ఎన్1 వైరస్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా హెచ్‌3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. H3N2 సహా సీజనల్ ఇన్ ఫ్లూయెంజా నుండి వచ్చే కేసులు మార్చి చివరి నుండి తగ్గుతాయని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది. ప్రతి సంవత్సరం భారతదేశం కాలానుగుణ ఇన్ ఫ్లూయెంజా రెండు సీజన్లలో విజృంభిస్తుంది. ఒకటి జనవరి నుండి మార్చి వరకు.. రెండోది రుతుపవనాల అనంతర కాలంలో  సీజనల్ ఇన్ ఫ్లూయెంజా వల్ల వచ్చే కేసులని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజృంభిస్తున్న హాంకాంగ్ ఫ్లూ.. H3N2 వైరస్ మార్చి నెలాఖరు నుంచి తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఈ హాంకాంగ్ ఫ్లూ వైరస్‌ల వల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది. ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. కొన్ని నెలలలో కేసులు పెరుగుతాయని తెలిపింది.

 H3N2 వైరస్ నివారణకు కేంద్రం కొన్ని కీలకమైన చర్యలు: 

ఇవి కూడా చదవండి

ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫారమ్ లో (IDSP-IHIP) అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం.. H3N2తో సహా వివిధ రకాల ఇన్ ఫ్లూయెంజాలకు సంబంధించిన మొత్తం 3038 ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ఈ వైరస్ కేసులు 9 రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చాయి.  ఈ నివేదికలో జనవరిలో 1307, ఫిబ్రవరిలో 1245 కేసులు, మార్చి 9 వరకు 486 కేసులు ఉన్నాయి.

జనవరి 2023 నెలలో..  దేశం నుండి మొత్తం 397,814 అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్/ఇన్‌ఫ్లుఎంజా లైక్ ఇల్‌నెస్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2023లో 436,523కి కొద్దిగా పెరిగాయి. మార్చి 2023 మొదటి 9 రోజుల్లోనే ఈ సంఖ్య 133,412 లకు చేరుకున్నాయి. అయితే తీవ్ర మైన లక్షణాలతో అడ్మిట్ అయిన కేసులకు సంబంధించిన డేటా ప్రకారం.. జనవరి 2023లో 7041 కేసులు, ఫిబ్రవరి 2023లో 6919 , మార్చి 2023 మొదటి 9 రోజుల్లో 1866 కేసులు నమోదయ్యాయి.

ఫిబ్రవరి 28 వరకు మొత్తం 955 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర (170), గుజరాత్ (74), కేరళ (42), పంజాబ్ (28) తర్వాత తమిళనాడు (545) హెచ్‌1ఎన్1 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నాటక, హర్యానాల్లో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుఎంజాతో ఒక్కొక్కరు మరణించారని నిర్ధారించారు.

ఎవరిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందంటే..  సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్దులు, ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ..  రోగుల వర్గీకరణ, చికిత్స ప్రోటోకాల్, కేంద్ర రాష్ట్రాలకు వెంటిలేటరీ నిర్వహణపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నియమ నిబంధనలు కేంద్ర మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (www.mohfw.nic.in) , NCDC (ncdc.gov.)లో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్స్ చేసిన  ఒసెల్టామివిర్ అనే టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఔషధం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 2017లో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ షెడ్యూల్ హెచ్1 ప్రకారం ఒసెల్టామివిర్ అమ్మకానికి ప్రభుత్వం అనుమతించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..