Viral Video: ఆటోడ్రైవర్, ప్రయాణీకురాలి మధ్య కన్నడ, హిందీ భాషల కోసం వాదన.. ఇరువురి గొడవ వీడియో వైరల్

ఆటోడ్రైవర్ ప్రయాణికులను కన్నడలో మాట్లాడమని కోరగా.. అందులో ఒక యువతి కన్నడలో మాట్లాడలేము అని చెప్పింది. అసలు మేము ఎందుకు కన్నడలో ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించింది.?" అలా డ్రైవర్‌కు, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం జరగడంతో డ్రైవర్‌ తన ఆటోలోంచి కిందకు దిగమని ప్రయాణికులను కోరాడు.

Viral Video: ఆటోడ్రైవర్, ప్రయాణీకురాలి మధ్య కన్నడ, హిందీ భాషల కోసం వాదన.. ఇరువురి గొడవ వీడియో వైరల్
Viral Video
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 13, 2023 | 1:05 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఆటో డ్రైవర్, మహిళా ప్రయాణీకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. అది కూడా కన్నడ భాష, హిందీ భాష గురించి వాదన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ మహిళా ప్రయాణికులతో అసభ్యంగా మాట్లాడుతూ.. కన్నడలో మాట్లాడాలని కోరుతున్నాడు. అదే సమయంలో ప్రయాణీకులకు నేను హిందీ ఎందుకు మాట్లాడాలి? “ఇది మా భూమి” అని కూడా చెబుతున్నాడు.  ఈ వీడియోపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

నిజానికి ఆటోడ్రైవర్ ప్రయాణికులను కన్నడలో మాట్లాడమని కోరగా.. అందులో ఒక యువతి కన్నడలో మాట్లాడలేము అని చెప్పింది. అసలు మేము ఎందుకు కన్నడలో ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించింది.?” అలా డ్రైవర్‌కు, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం జరగడంతో డ్రైవర్‌ తన ఆటోలోంచి కిందకు దిగమని ప్రయాణికులను కోరాడు. అంతే కాదు.. డ్రైవర్ కోపంగా.. “ఇది కర్ణాటక, మీరు కన్నడలో మాట్లాడండి. ఇది మా భూమి మీది కాదు. నేను హిందీలో ఎందుకు మాట్లాడాలి?  నార్త్ ఇండియన్ బిచ్చగాళ్ళు అంటూ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి

భిన్న స్పందన:  వైరల్ అవుతున్న ఈ వీడియోపై ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఆటో డ్రైవ్‌కు అహంకారం ఎక్కువగా ఉంది అని వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు ఇద్దరూ ఎవరి ప్రాంతీయ భాషలను వారు గౌరవించుకోవాలని అంటున్నారు. వీడియోను పోస్ట్ చేస్తూ.. ఒక ట్విట్టర్ వినియోగదారు ఇద్దరూ చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు వివాదం ఎందుకు? ఎవరిపైనా ఏ భాషనూ రుద్దాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ భాషలతో ఎవరికైనా సౌకర్యంగా లేకుంటే.. వారు ఇంగ్లీషు వంటి సాధారణ భాషను నేర్చుకోవాలని సూచించారు.

మరికొందరు వినియోగదారులు ఆటో డ్రైవర్‌ అహంకారాన్ని ప్రశ్నించగా, స్థానిక భాషను గౌరవించడం లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో కర్ణాటక రాజధాని బెంగుళూరుకు సంబంధించింది అని తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి