AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేరుశెనగతో చీజ్ బ్లాస్ట్ సోడా.. ఈ షాప్‌ను క్లోజ్ చేయండి బాబోయ్ అంటున్న నెటిజన్లు.. రెసిపీపై ఓ లుక్ వేయండి

చీజ్ ను సాధారణంగా పాస్తా, పిజ్జా , శాండ్‌విచ్‌ల వంటి ఆహార పదార్ధాలకు టాపింగ్ చేస్తారు. అయితే ఇప్పుడు డ్రింక్ తో చీజ్ చేసిన ప్రయోగంతో మరొక స్థాయికి చేరుకుంది. ఇంటర్నెట్‌లో షేర్ చేసిన ఈ చీజ్ సోడా బ్లాస్ట్ డ్రింక్‌లో చీజ్ ను గార్నిష్‌గా ఉపయోగించాడు. డ్రింక్ ఆకుపచ్చ రంగులో ఉంది.

Viral Video: వేరుశెనగతో చీజ్ బ్లాస్ట్ సోడా.. ఈ షాప్‌ను క్లోజ్ చేయండి బాబోయ్ అంటున్న నెటిజన్లు.. రెసిపీపై ఓ లుక్ వేయండి
Viral Video
Surya Kala
|

Updated on: Mar 09, 2023 | 1:47 PM

Share

చంటబ్బాయి సినిమాలో శ్రీ లక్ష్మి వింతైన వంటలు చేస్తూ.. వాటికీ అంతకంటే అరటికాయ లంబా లంబా, బంగాళా దుంప భౌ, భౌ అంటూ  వింత పేర్లు పెట్టి.. ఓ పత్రికా ఎడిటర్ ను వాటిని ప్రచురించమని ఇచ్చే సీన్ చూసి ఇప్పటికీ నవ్వుకునేవారు అనేక మంది ఉన్నారు. అయితే అప్పటి శ్రీలక్ష్మికి నిజ జీవితంలో తమ్ముడు దొరికేశాడు.. రకరకాల పదార్ధాలతో… వింతైన ఆహారం, డ్రింక్స్ ను తయారు చేస్తూ.. వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు ఓ యువకుడు.  తాజాగా ఓ డ్రింక్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతువుంది. అందులోని డ్రింక్ చూస్తే.. బాబోయ్ ఇదేమి రెసిపీ అనకమానరు ఎవరైనా.. ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత.. సమ్మర్ స్పెషల్ గా కూల్ డ్రింక్స్ ను అమ్మతున్నాడు. అయితే ఫుడ్ బ్లాగింగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘ఫుడ్ అడిక్టెడ్’ లో షేర్ చేసిన వీడియోలో విచిత్రమైన సోడా ఉంది. దానిపేరు కూడా చీజ్ సోడా బ్లాస్ట్ డ్రింక్‌

చీజ్ ను సాధారణంగా పాస్తా, పిజ్జా , శాండ్‌విచ్‌ల వంటి ఆహార పదార్ధాలకు టాపింగ్ చేస్తారు. అయితే ఇప్పుడు డ్రింక్ తో చీజ్ చేసిన ప్రయోగంతో మరొక స్థాయికి చేరుకుంది. ఇంటర్నెట్‌లో షేర్ చేసిన ఈ చీజ్ సోడా బ్లాస్ట్ డ్రింక్‌లో చీజ్ ను గార్నిష్‌గా ఉపయోగించాడు. డ్రింక్ ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకుని దానిలో ఐస్ వేసి.. వేరు శనగ గింజలను వేసి.. అనంతరం దానిని వివిధ రంగుల పైనాపిల్,  బ్లూబెర్రీ సోడాలతో నింపేశాడు. ఆ కూల్ డ్రింక్ ను చీజ్ తో అలంకరించాడు. ఫస్ట్ టైం.. “సూరత్ చీజ్ బ్లాస్ట్ సోడా జున్ను బ్లాస్ట్ సోడా.. మీకు దైర్యం ఉంటే  ఒక్కసారి తాగి చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు .

వేరుశెనగతో చీజ్ బ్లాస్ట్ సోడా డ్రింక్ మేకింగ్ వీడియో 

ఈ వీడియో ఒక వారం క్రితం షేర్ చేశారు. 646k వ్యూస్, 10.8k లైక్‌లు సొంతం చేసుకుంది. ఒక గ్లాసు సోడా డ్రింక్‌లో వేరుశెనగ , జున్ను అవసరమా అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఈ డ్రింక్ ను చూడడానికి కూడా ఇష్టం పడడం లేదన్నారు ఒకరు.  అసలు ఇలాంటి డ్రింక్స్ తయారు చేస్తున్న ఈ  దుకాణాన్ని మూసివేయాలని కూడా పిలుపునిచ్చారు.

“ఆహారంలో కొత్తవి ప్రయత్నించకుండా సూరత్‌ను నిషేధించాలి” అని ఒకరు వ్యాఖ్యానించారు.  ఎక్కువ మంది ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకుండా అతని షాప్ మూసేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..