Viral Video: ఆకర్షించే టోన్, రిథమ్‌తో కుల్ఫీని అమ్ముతున్న వ్యక్తి.. డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఈ బిజినెస్ మొదలు పెట్టాడంటున్న నెటిజన్లు

ప్రజల దృష్టిని తన కుల్ఫీ బండివైపు తిప్పుకునేందుకు పాట పాడుతూ కుల్ఫీని అమ్ముతున్నాడు. ఆకర్షించే టోన్, రిథమ్, అతని శైలిని ప్రజలు ఇష్టపడ్డారు. అంతేకాదు ఆ వ్యక్తి చూడడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లా అనిపిస్తున్నాడు చూపరులకు.

Viral Video: ఆకర్షించే టోన్, రిథమ్‌తో కుల్ఫీని అమ్ముతున్న వ్యక్తి.. డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఈ బిజినెస్ మొదలు పెట్టాడంటున్న నెటిజన్లు
Kulfi Wale Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2023 | 8:47 PM

సోషల్ మీడియాలో వేరుశెనగలు అమ్మే భుబన్ బద్యాకర్ పాడిన కచ్చా బాదం పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.    ఇప్పుడు ఈ స్టైల్‌లో కుల్ఫీని అమ్మే వ్యక్తి ఓ సాంగ్ ను పాడుతూ.. ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ  వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం కుల్ఫీని అమ్ముతున్నాడు ఓ వ్యక్తి.. అయితే అతను ,  ప్రజల దృష్టిని తన కుల్ఫీ బండివైపు తిప్పుకునేందుకు పాట పాడుతూ కుల్ఫీని అమ్ముతున్నాడు. ఆకర్షించే టోన్, రిథమ్, అతని శైలిని ప్రజలు ఇష్టపడ్డారు. అంతేకాదు ఆ వ్యక్తి చూడడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లా అనిపిస్తున్నాడు చూపరులకు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు గట్టిగా పాట పాడుతూ వీధుల్లో కుల్ఫీని విక్రయిస్తున్నాడు.  అతని మధురమైన స్వరం, లయ చూసి విన్నవారు అతని ఫ్యాన్స్ అవుతున్నారు. అతని స్టైల్ నెటిజన్లకు బాగా నచ్చింది. మీ గాత్రంతో మా హృదయాన్ని గెలుచుకున్నావు చాచా అని అంటారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

ట్విట్టర్‌లో, @yunusrj హ్యాండిల్‌కు చెందిన యూనస్ ఖాన్  కుల్ఫీ చాచా  వీడియో షేర్ చేశారు.  వ్యాపారం చేయడానికి ప్రతి ఒక్కరికీ సొంత స్టైల్ ఉంటుంది. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. చాచా ఎంత అద్భుతంగా కుల్ఫీని అమ్ముతున్నాడో అనకమానరు చూసిన వారు.  23 సెకన్ల క్లిప్‌ను ఇప్పటివరకు 13,000 కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఒకరు కామెంట్ చేస్తూ ఈ వీడియో పాతదని, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినదని పేర్కొన్నాడు. ఈ కుల్ఫీ అమ్ముతున్న చాచా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు.. అయితే గానం వల్ల కాదు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిక కారణంగా అని చెప్పాడు. అదే సమయంలో, ‘వీడియో ఎక్కడిదైనా..  ఎంత పాతదైనా.. ఆ వ్యక్తి తనదైన శైలిలో వినియోగదారుల హృదయాన్ని దోచుకున్నాడు’ అని మరొక వినియోగదారు చెప్పారు. మరొకరు డొనాల్డ్ ట్రంప్ మామ. మీరు ఎప్పుడు కుల్ఫీ అమ్మడం ప్రారంభించారు అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..