Viral Video: లోకల్‌ ట్రైన్‌లో గానా బజానా.. లతామంగేష్కర్‌ పాటలతో అలరించిన ప్రయాణికులు.. వీడియోపై ఓ లుక్ వేయండి..

బోగీ నిండా రకరకాల మనుషులతో కలిసి ప్రయాణించడం మంచి అనుభూతినిస్తుంది. అలా లోకల్‌ ట్రైన్‌లో కలిసి ప్రయాణిస్తున్న కొందరు సందడి చేశారు. హుషారుగా సాగిపోతున్న వారి ప్రయాణానికి మరింత ఊపునిస్తూ ఆటపాటలతో హోరెత్తించారు.

Viral Video: లోకల్‌ ట్రైన్‌లో గానా బజానా.. లతామంగేష్కర్‌ పాటలతో అలరించిన ప్రయాణికులు.. వీడియోపై ఓ లుక్ వేయండి..
Mumbai Local Train
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2023 | 3:25 PM

రైలు ప్రయాణం ఎవరికైనా ఇష్టమే.. ప్రకృతితో పోటీ పడుతున్నామా అన్నట్లు సాగే ట్రైన్‌ జర్నీని పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడతారు. ట్రైన్ లో ప్రయాణిస్తూ..తినడం, ఆడుతూ పాడుతూ సాగడం.. అదొక మంచి అనుభూతి..  ముఖ్యంగా ట్రైన్‌ జర్నీ చాలా సరదాగా ఉంటుంది. బోగీ నిండా రకరకాల మనుషులతో కలిసి ప్రయాణించడం మంచి అనుభూతినిస్తుంది. అలా లోకల్‌ ట్రైన్‌లో కలిసి ప్రయాణిస్తున్న కొందరు సందడి చేశారు. హుషారుగా సాగిపోతున్న వారి ప్రయాణానికి మరింత ఊపునిస్తూ ఆటపాటలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

లెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ ఆలపించిన సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ పాడుతూ తమదైన శైలిలో స్టెప్పులేస్తూ అందరినీ అలరించారు. ఆ ప్రయాణికుల్లో యువకులు, వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా తమ వయసును మర్చిపోయి, స్టెప్పులేస్తూ కొందరు, ట్రైన్‌ డోర్‌పైన దరువేస్తూ కొందరు ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఇదంతా ముంబై లోకల్‌ ట్రైన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను చిల్డ్‌ యోగి అనే ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ‘తాను చూసిన అత్యుత్తమ ఆటపాటల సెషన్స్‌లో ఇదొకటి’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రయాణీకుల సందడిపై ఓ లుక్ వేయండి.. 

వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 12 వేలమందకి పైగా వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అంకుల్స్‌ మా ప్రయాణాన్ని ఎంతో అందంగా మలిచారంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..