AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైలు చివరి బోగి వెనకాల ‘X’ గుర్తు ఎందుకు ఉంటుందో ఆలోచించారా.? దీని అర్థం ఏంటంటే..

దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చేది ఏదంటే టక్కున చెప్పే సమాధానం రైళ్లు. దేశవ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల వేర విస్తరించిన రైల్వేలు ఎంతో మందిని గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. ఇక రైలు ప్రయాణం ఎంత..

Indian Railway: రైలు చివరి బోగి వెనకాల 'X' గుర్తు ఎందుకు ఉంటుందో ఆలోచించారా.? దీని అర్థం ఏంటంటే..
Indian Railway
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 06, 2023 | 3:02 PM

దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చేది ఏదంటే టక్కున చెప్పే సమాధానం రైళ్లు. దేశవ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల వేర విస్తరించిన రైల్వేలు ఎంతో మందిని గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. ఇక రైలు ప్రయాణం ఎంత సంతోషంగా ఉంటుందో రైల్వేలో తెలుసుకోవాల్సిన విషయాలు కూడా అన్నే ఉంటాయి. రైలు లోపల ఉండే చైన్‌ నుంచి రైలు బోగీలపై రాసి ఉన్న అక్షరాల వరకు వాటిలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి చివరి బోగి వెనకాల రాసి ఉండే ‘X’ సింబల్‌. మీలో చాలా మంది దీనిని కచ్చితంగా గమనించే ఉంటారు. అయితే ఎలా ఎందుకు రాసి ఉంటుందన్న దానిపై ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి రైలు చివరి బోగిపై తెలుపు లేదా పసుపు రంగుతో ‘X’ గుర్తును రాస్తారు. రైలుకు అదే చివరి కోచ్‌ అని తెలిపేందుకు ఈ గుర్తును వేస్తారు. ప్రయణించే రైలు కోచ్‌లను మధ్యలో వదలకుండా ముందుకు వెళుతుందని దీని ద్వారా తెలుసుకుంటారు. ఒకవేళ చివరి బోగీపై ఈ గుర్తు లేకపోతే ఆ రైలుకు ఏదో ప్రమాదం జరిగినట్లు భావిస్తారు. అందుకే స్టేషన్‌ నుంచి రైలు క్రాసింగ్ అయ్యే సమయంలో గార్డు.. ‘X’ మార్కును గుర్తించిన తరువాతనే రైలు బోగీలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్థారిస్తూ ఆకుపచ్చ జెండాను చూపిస్తారు.

ఒకవేళ ‘X’ గుర్తు లేకపోతే వెంటనే అలర్ట్‌ అయ్యే స్టేషన్‌ మాస్టర్‌ హెచ్చరికను జారీ చేస్తారు. దీంతో అధికారులు అలర్ట్‌ అవుతారు. ఇక X సింబల్‌తో పాటు LV అని కూడా రాసి ఉంటుంది. దీని అర్థం.. “లాస్ట్ వెహికల్”. వీటితో పాటు చివరి బోగీపై రెడ్‌ కలర్‌ లైట్‌ కూడా ఉంటుంది. రాత్రి సమయాల్లో చివరి బోగీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. రైలు మధ్యలో ఉండే ఏ కోచ్‌పై వెనకాల కూడా ఇలాంటి సింబల్స్‌ ఉండవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకో తెలుసా
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకో తెలుసా
బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్.. నేషనల్‌ రేంజ్‌కి మన హీరోలు..
బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్.. నేషనల్‌ రేంజ్‌కి మన హీరోలు..
ఎండలో తిరుగుతున్నారా .. ఈ జాగ్రత్తలు తప్పని సరి వీడియో
ఎండలో తిరుగుతున్నారా .. ఈ జాగ్రత్తలు తప్పని సరి వీడియో
అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో
అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో
కొబ్బరి కాయల వ్యాను బోల్తా.. అక్కడి స్థానికులు ఏం చేశారంటే? వీడియ
కొబ్బరి కాయల వ్యాను బోల్తా.. అక్కడి స్థానికులు ఏం చేశారంటే? వీడియ
వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా? వీడియో
వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా? వీడియో
పహల్గామ్‌ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. చంపే ముందు ప్యాంటు విప్పి..
పహల్గామ్‌ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. చంపే ముందు ప్యాంటు విప్పి..
బిజినెస్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 లక్షల లోన్
బిజినెస్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 లక్షల లోన్
అలాంటి కామెంట్స్ పెడతారా? చాలా బాధగా ఉందన్న శేఖర్ మాస్టర్
అలాంటి కామెంట్స్ పెడతారా? చాలా బాధగా ఉందన్న శేఖర్ మాస్టర్
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ ఎవరు? వీడియో
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ ఎవరు? వీడియో