- Telugu News Photo Gallery Travel womens day 2023 5 places in india are most safe for ladies for solo trip Telugu News
Women’s Day 2023: ఆడవాళ్లకు అత్యంత సురక్షితమైన పర్యాటక ప్రదేశాలు ఇవి..! ఈ ఉమెన్స్ డే కి టూర్ ప్లాన్ చేసుకోండి..
మహిళా దినోత్సవం 2023: మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడపాలనుకుంటున్నారా..? అందుకోసం మీరంతా కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఈ టూర్ ప్లాన్ మీ కోసమే. భారతదేశంలోని ఈ ఆరు పర్యాటక ప్రదేశాలు మహిళలకు అత్యంత సురక్షితమైనవిగా చెప్పొచ్చు.
Updated on: Mar 06, 2023 | 3:37 PM

మున్నార్: పర్యాటకులకు స్వర్గధామంగా పిలువబడే మున్నార్‌లో మీకు కనువిందే చేసే పర్వతశ్రేణులు, తేయాకు తోటలు, అందమైన తోటలు మిమ్మల్ని కళ్లు తిప్పుకోకుండా చేస్తాయి.

వారణాసి: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఇక్కడ మీరు ఒంటరిగా విహారయాత్రకు రావచ్చు. లేదంటే అమ్మాయిలు సమూహంగా కూడా ప్రయాణించవచ్చు. ఇక్కడ గంగా ఆరతి అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గంగా నది ఒడ్డున మీరు చాలా ప్రశాంతంగా గడుపుతారు.

Jaisalmer- రాజస్థాన్‌లో సందర్శించాల్సిన అనేక నగరాలు పర్యాటక పరంగా అద్భుతంగా ఉన్నాయి. జైపూర్, ఉదయపూర్ కాకుండా మీరు కొత్త ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే, మీరు జైసల్మేర్ వెళ్ళవచ్చు. ఇక్కడ మహిళలు సురక్షితంగా తిరుగుతారు. దీనిని గోల్డెన్ సిటీ అంటారు. మీరు ఎడారి సఫారీకి వెళ్లవచ్చు, జైన దేవాలయాన్ని సందర్శించవచ్చు. శాపగ్రస్తమైన కులధార గ్రామాన్ని సందర్శించవచ్చు.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత అందమైన నగరం, భారతదేశంలోని సురక్షితమైన నగరాల్లో సిమ్లా కూడా ఒకటి. ఇక్కడ మీరు మీ గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి మీ సెలవులను ప్లాన్ చేసుకోవచ్చు.

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ వంటి అందమైన రాష్ట్రంలో మీరు మీ గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి సందర్శించగలిగే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో ఔలి, రిషికేశ్, డెహ్రాడూన్ వంటి అనేక ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. ఇవి సురక్షితమైన, అందమైన పర్యాటక ప్రదేశాలుగా పరిగణించబడతాయి.
