- Telugu News Photo Gallery Cinema photos Mumbai Cyber Crimes: 40 victims of bank account fraud in 3 days in mumbai, Actress Shweta Menon also a victim
సైబర్ నేరగాళ్ల వలలో విలవిల.. లింక్ క్లిక్ చేసి డబ్బులు పొగొట్టుకున్న ప్రముఖ నటి!
ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. .
Updated on: Mar 06, 2023 | 1:58 PM

ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు.

కేవైసీ, పాన్ వివరాలను అప్‌డేట్ చేయాలంటూ వచ్చిన ఓ లింక్‌పై క్లిక్ చేయడంతో కేవలం మూడు రోజుల వ్యవధిలో లక్షల రూపాయలు కొల్లగొట్టారు. పాన్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని, లేనిపక్షంలో బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్లు పంపిన లింక్‌పై క్లిక్ లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు.

తాజాగా ఇలా డబ్బు పోగొట్టుకున్న 40 మంది బాధితుల్లో ప్రముఖ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. ఇటీవల తన మొబైల్‌క వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి తన కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ నమోదు చేశానని, తన ఖాతా నుంచి రూ.57 వేలకుపైగా కట్ అయ్యినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది

నిజానికి బ్యాంక్ కస్టమర్‌లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి కేవైసీ చేయించుకోవడం తప్పనిసరైనప్పటికీ అందుకోసం బ్యాంకులు ఎలాంటి మెసేజ్‌లను పంపవు.

బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్/యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ నమోదు చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లి కూడా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.




