AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Running On Water: ఈ ట్రిక్ తెలిస్తే మీరు కూడా నీటిపై పరుగెత్తవచ్చు.. బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన వీడియో చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ జంతువు నీటిపై ఎలా తిరుగుతుందో చూసి నెటిజనం ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. పక్కనే ఓ బోటు తేలుతూ కనిపించడం..

Running On Water: ఈ ట్రిక్ తెలిస్తే మీరు కూడా నీటిపై పరుగెత్తవచ్చు.. బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన వీడియో చూడండి..
Horse Run On Water
Sanjay Kasula
|

Updated on: Mar 06, 2023 | 9:03 PM

Share

నీటిపై ఎలా నడపాలి.. అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇది సాధ్యం కాదు అని మీరు అనుకుంటే, మిమ్మల్ని గందరగోళానికి గురిచేసుకున్నట్లే.. ఎందుకంటే ఈ వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీ నిర్ణయం తప్పు అని అనుకుంటారు. దీనికి కారణం ఈ వీడియోలో గుర్రం నీటిపై నడవటాన్ని చూడవచ్చు. అంతే కాదు నీటిపై నడుస్తున్న గుర్రం పక్కనే ఓ పడవ కూడా కూడవచ్చు. అక్కడ నీరు ఉందని తెలిసింది. ఈ గుర్రం నడవటాన్ని చూసి మీరు నీటిపై కూడా నడవవచ్చు. వాస్తవానికి, ఈ వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీరు కూడా నీటిపై నడవండి అని క్యాప్షన్‌లో ఆనంద్ మహేంద్ర రాశారు. అయితే దీని కోసం మీ పై మీకు నమ్మకం ఉండాలి. అదంతా మైండ్ గేమ్.

రన్నింగ్ చేస్తూ అవతలి వైపు వెళుతుంది. ఈ వీడియోలో ఒక అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒక గుర్రం ఆ నదిలో అడుగు పెట్టింది. ఎంట్రీ ఇస్తున్నప్పుడు గుర్రం నీళ్ల కిందకు వెళ్తుందేమో అనిపించింది. కానీ నీళ్లలోంచి పరుగెత్తింది. ఇది చూసిన జనాలు అసలు ఏది నిజం అని అయోమయంలో పడ్డారు. అయితే ఈ వీడియోలో నిజం ఏంటనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఇది ఖచ్చితంగా వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిచర్యల దశ కూడా ప్రారంభమైంది.

వీడియోను ఇక్కడ చూడండి..

మీ రన్నింగ్ స్పీడ్ 67 mph కంటే ఎక్కువగా ఉంటే మీరు నీటిలో సులభంగా పరుగెత్తవచ్చని ఓ పేర్కొన్నారు. అదేంటంటే, ఈ గుర్రం నీటిలో ఎలా సులువుగా పరిగెడుతుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు అక్కడ నీరు లోతుగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది నిర్ధారించబడలేదు. ఈ వీడియో పాతదైనప్పటికీ మళ్లీ వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోను చూడండి