Viral Video: రిసెప్షన్‌లో వరుడిని కౌగిలించుకున్న బురఖా ధరించిన యువతి.. వధువు రియాక్షన్ చూడాలంటే వీడియోపై ఓ లుక్ వేయండి..

వధూవరులు వేదికపై నిలబడి ఉన్నట్లు క్లిప్‌లో చూడవచ్చు. అదే సమయంలో నవ దంపతులకు అభినందనలు తెలిపేందుకు ఒక్కొక్కరుగా వేదికపైకి వస్తున్నారు. ఇంతలో.. బురఖాలో ఒక లేడీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె అందరి ముందు వరుడిని కౌగిలించుకోవడమే కాకుండా బలవంతంగా ముద్దులు పెట్టడం ప్రారంభించింది.

Viral Video: రిసెప్షన్‌లో వరుడిని కౌగిలించుకున్న బురఖా ధరించిన యువతి.. వధువు రియాక్షన్ చూడాలంటే వీడియోపై ఓ లుక్ వేయండి..
Wedding Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2023 | 12:10 PM

భారతీయ సంప్రదాయంలో వివాహం ఓ పెద్ద వేడుక. యువతీ యువకుల జీవితంలో అతి ముఖ్య ఘట్టం పెళ్లి. దీంతో పెళ్లిని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిపిస్తారు. ఇప్పటి పెళ్లి వేడుకలో నయా ట్రెండ్ రిసెప్షన్ వేడుక. వివాహ రిసెప్షన్‌ వేదికపై వధూవరులు నిలబడి.. ఆహుతుల నుంచి శుభాకాంక్షలను అందుకుంటారు. వేదికపై నిలబడి ఉన్న పెళ్లికూతురు, పెళ్లికొడుక్కి బంధువులు, అతిథులు ఒక్కొక్కరుగా వేదికపైకి చేరుకుని అభినందనలు తెలుపుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో కొన్నిసార్లు చిలిపి పనులు చేస్తూ.. స్నేహితులు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో బురఖాలో తెలియని మహిళ ( బురఖా ధరించిన మహిళ ) వేదికపైకి వచ్చి ప్రియురాలిలా అందరి ముందు పెళ్లికొడుకు గట్టిగా కౌగిలించుకుంది. ఇలా తన భర్తను బహిరంగంగా ఓ మహిళ కౌగిలించుకోవడం చూసిన సమయంలో ఆ వరుడి పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి.. ప్రస్తుతం, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నవ వధువు స్పందనతో పాటు.. ఈ వీడియో చివర వరకూ చూసిన నెటిజెన్ల మోముపై చిరునవ్వులు పుస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వివాహ రిసెప్షన్ జరుగుతుంది. వధూవరులు వేదికపై నిలబడి ఉన్నట్లు క్లిప్‌లో చూడవచ్చు. అదే సమయంలో నవ దంపతులకు అభినందనలు తెలిపేందుకు ఒక్కొక్కరుగా వేదికపైకి వస్తున్నారు. ఇంతలో.. బురఖాలో ఒక లేడీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె అందరి ముందు వరుడిని కౌగిలించుకోవడమే కాకుండా బలవంతంగా ముద్దులు పెట్టడం ప్రారంభించింది. ఇది చూసి అక్కడ ఉన్న బంధువులు, అతిథులు అవాక్కయ్యారు. అదే సమయంలో పెళ్లికొడుకు పరిస్థితి కూడా అయోమయంగా మారింది. ఇక వధువు కూడా షాక్ తిన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

చివరకు నిజం తెలిసి అందరూ హాయిగా నవ్వేశారు. ఎందుకంటే.. బురఖా మాటున ఉంది.. వరుడు స్నేహితుడు అని తెలియడంతో.. మీరు కూడా ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. పల్లవి ప్రియ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్  చేసింది. ప్రతి స్నేహితుడూ బాస్టర్డ్’ అని క్యాప్షన్ జత చేసింది ఈ వీడియోకు. వైరల్ క్లిప్ కు 40 వేల వ్యూస్, వందలాది లైక్స్ వచ్చాయి. మొత్తానికి ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..