Viral Video: పెళ్లి వేడుకలో చిన్నారి బాలిక డ్యాన్స్..ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కూడా ఇలా చేయలేడంటున్న నెటిజన్లు

ఓ పెళ్లి వేడుకలో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో.. తాను డ్యాన్స్ చేస్తున్న సమయంలో మధ్యలోకి వచ్చినా ఆ బాలిక ఏమాత్రం పట్టించుకోలేదు.

Viral Video: పెళ్లి వేడుకలో చిన్నారి బాలిక డ్యాన్స్..ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కూడా ఇలా చేయలేడంటున్న నెటిజన్లు
Dance Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Mar 07, 2023 | 3:06 PM

ప్రపంచంలో ప్రతిభావంతులైన పిల్లలకు కొరత లేదు. నేటి కాలంలో అలాంటి పిల్లలకు ఇంటర్నెట్ ఒక వరం కంటే తక్కువ కాదు . అలాంటి ప్రతిభావంతులైన పిల్లల వీడియోలు ప్రతిరోజూ ఇక్కడ కనిపిస్తాయి. ఆ వీడియోలను చూసిన తర్వాత ముఖంలో చిరునవ్వు వస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇందులో ఓ అమ్మాయి 52 గజాల పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

ఈరోజుల్లో చిన్న పిల్లలు చూడడానికి.. వయసు రీత్యా చిన్నపిల్లలు.. అయితే వారిలో అద్భుతమైన ప్రతిభ కనిపిస్తోంది. పాడినా, డ్యాన్స్ చేసినా, విన్యాసాలు చేసినా, మరేదైనా పెద్దవారికంటే తాము ఏ విధంగా తక్కువ కాము అని నిరూపిస్తున్నారు. తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా గానం లేదా డ్యాన్స్‌లో నేటి పిల్లలకు సాటి లేదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి జరుగుతుంది. ఈ వేడుకలో ఓ చిన్నారి బాలిక చేసిన డ్యాన్స్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఎందుకంటే బాలిక చేసిన డ్యాన్స్ చూస్తే ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కూడా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

ఓ పెళ్లి వేడుకలో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో.. తాను డ్యాన్స్ చేస్తున్న సమయంలో మధ్యలోకి వచ్చినా ఆ బాలిక ఏమాత్రం పట్టించుకోలేదు. హ్యాపీగా ఆ సాంగ్ కు తగిన విధంగా స్టెప్స్ వేస్తూ.. తన ప్రదర్శనను కొనసాగించింది. ఆ చిన్నారి బాలిక డ్యాన్స్ చూసి చాలా మంది మహిళలు ఆమెకు డబ్బు ఇచ్చారు.  ఈ వీడియో చూసిన తర్వాత.. అమ్మాయి ప్రతిభను మెచ్చుకుంటారు.

ఈ వీడియోను @sachkadwahai అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశారు. ‘జీవితంలో ఒకరికి కావలసింది ఒక్కటే’ అనే క్యాప్షన్ రాశారు. బాలిక డ్యాన్స్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ‘అతిపెద్ద డాన్సర్,  కొరియోగ్రాఫర్ కూడా ఇలా డ్యాన్స్ చేయలేరు అని కామెంట్ చేయగా..  మరొకరు, ‘దీని కోసం అమ్మాయి చాలా సాధన చేసి ఉండాలి’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..