Watch: తనను తానే కాటేసుకున్న కొండచిలువ.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
సాధారణంగా కొండచిలువలు ఇతర జంతువులను నలిపి వాటిని ఆహారంగా తింటాయి. కానీ, కొండచిలువలు తమ శరీరాన్ని తామే కాటు వేయవు. తినవు. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు.
కొన్ని రకాల పాములు..వాటికంటే చిన్న పాములను తినేస్తుంటాయి. మామూలు పాములే కాదు.. ఏకంగా పాము జాతికి రారాజుగా వర్ణించబడిన కింగ్ కోబ్రా కూడా తన సొంత జాతినే తింటుంది. అయితే ఎక్కడైనా ఒక పాము తనను తానే తినటం చూశారా..? అంటే, పాము తన శరీరాన్ని తానే తినటం..? అదేలా జరుగుతుందనే కదా మీ సందేహం..మీ సందేహాన్ని మరింత పెంచేలా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాము వీడియో హల్ చల్ చేస్తోంది. ఒక పాము తనను తాను తినడానికి ప్రయత్నిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
పాము తన తోకను తానే కొరికినట్లు ఆ వీడియో ఉంది. పాము మొదట తన తోకను కొరికి, ఆ తర్వాత తన శరీరంలోని మరో భాగాన్ని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ట్రాక్టర్ లాంటి వాహనం మధ్యలో వేలాడుతుంది ఒక మినీ సైజున్న కొండచిలువ. అప్పుడు ఆ పాము తన నేల మీదకు జారిపోతున్న క్రమంలో తనను కాటేస్తుంది. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
వాహనం మీద నుంచి కిందకు దిగే క్రమంలో ఒక కొండచిలువ తన తోకను ఎరగా భావించి కొరికేస్తుంది. సాధారణంగా కొండచిలువలు ఇతర జంతువులను నలిపి వాటిని ఆహారంగా తింటాయి. కానీ, కొండచిలువలు తమ శరీరాన్ని తామే కాటు వేయవు. తినవు. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ విదాస్ నో పాంటనల్ షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే 84.2 మిలియన్ల మంది వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..