హనుమాన్ విగ్రహం ఎదుట లేడీ బాడీ బిల్డర్ల పోటీలు.. గంగా జలంతో శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు
హనుమాన్ కటౌట్ ముందే మహిళలతో బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించి హిందూ ధర్మాన్ని అవమానించారని బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ పోటీలను నిర్వహించిన మేయర్‌పై బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మధ్యప్రదేశ్ లోని రత్లాంలో హనుమాన్ విగ్రహం ముందు లేడీ బాడీ బిల్డర్ల కాంపిటీషన్‌పై వివాదం రాజుకుంది . బీజేపీ నేత , రత్లాం మేయర్ ప్రహ్లాద్‌పటేల్ నేతృత్వంలో ఈ పోటీని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
హనుమాన్ కటౌట్ ముందే మహిళలతో బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించి హిందూ ధర్మాన్ని అవమానించారని బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ పోటీలను నిర్వహించిన మేయర్‌పై బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భోపాల్‌తో సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
Shame on BJP pic.twitter.com/fxVrepzqLz
— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) March 6, 2023
పోటీలు జరిగిన వేదికను కాంగ్రెస్ నేతలు గంగాజలంతో శుద్ది చేశారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పిలుపు మేరకు ఘటనా స్థలి వద్ద హనుమాన్ చాలీసాను పఠించారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహార్ బర్త్‌డే వేడుకల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుచేటని , దీనికి సీఎం క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
रतलाम महापौर के मुख्य आतिथ्य में भगवान हनुमान जी की मूर्ति रखकर अश्लील प्रदर्शन वह भी मुख्यमंत्री जी के जन्मदिन के मौके पर।सनातन संस्कृति को बेचखाने वाले इस नेता पर क्या कार्यवाही होगी शिवराज जी? @BJP4India @OfficeOfKNath @digvijaya_28 @inc_jpagarwal pic.twitter.com/Xebc6dLKOW
— Bhupendra Gupta Agam (@BhupendraAgam) March 5, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి
