AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia Disaster: ఇండోనేషియాలో వరుణ బీభత్సం.. కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు మృతి..

సముద్ర మార్గం గుండా అక్కడి వెళ్లడానికి ఐదు గంటల సమయం పడుతుందని, అందుకే హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ టీమ్స్‌ను విపత్తు ప్రదేశానికి తరలిస్తున్నామని ఇండోనేషియా అధికారులు తెలిపారు.

Indonesia Disaster: ఇండోనేషియాలో వరుణ బీభత్సం.. కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు మృతి..
Indonesia Disaster
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2023 | 8:59 PM

Share

ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్‌ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది. మరో 50 మంది గల్లంతయ్యారు. అయితే, విపత్తు జరిగిన ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు సమాచార సంబంధాలు తెగిపోయాయి. ఈ మేరకు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

ఏజెన్సీ అందించిన చిత్రాలు బోర్నియో, మలేషియా ప్రధాన భూభాగం మధ్య ఉన్న సెరాసన్ ద్వీపంలోని ఒక కొండ అంచుకు సమీపంలో పరిస్థితిని, కొండచరియలు విరిగిపడిన, మట్టి శిధిలాలు కనిపించాయి. దాంతో అక్కడ రక్షణ, సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఆలస్యమవుతోంది.

సముద్ర మార్గం గుండా అక్కడి వెళ్లడానికి ఐదు గంటల సమయం పడుతుందని, అందుకే హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ టీమ్స్‌ను విపత్తు ప్రదేశానికి తరలిస్తున్నామని ఇండోనేషియా అధికారులు తెలిపారు. బోర్నియోలోని బంజర్‌ జిల్లాలో వరదల ధాటికి 17 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు