Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మంచు తుఫానులో చిక్కుకున్న 81 ఏళ్ల వృద్ధుడు.. 7 రోజుల పాటు క్యాండీలు తింటూ ప్రాణాలు దక్కించుకున్న…

సుమారు 30 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత జెర్రీ జౌరెట్ తన కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఇరుకైన సందులో మంచు తుఫానులో చిక్కుకున్నాడు. అనంతరం జెర్రీకి ఏ రకమైన సహాయం అందలేదు.. అలా కారులో గడపవలసి వచ్చింది.

Viral News: మంచు తుఫానులో చిక్కుకున్న 81 ఏళ్ల వృద్ధుడు.. 7 రోజుల పాటు క్యాండీలు తింటూ ప్రాణాలు దక్కించుకున్న...
Mr Jouret
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2023 | 6:33 PM

అమెరికాలో 81 ఏళ్ల వృద్ధుడు మంచు తుపానులో చిక్కుకున్నాడు. అలా  7 రోజులు పాటు మంచు తుఫాన్ లో గడిపాడు.. ప్రాణాల మీద ఆశ వదులుకోకుండా పట్టు వదలతో మృత్యువుతో పోరాడి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ ఏడు రోజులూ స్వీట్స్, క్రోసెంట్లు, బిస్కట్లను తింటూ ప్రాణాలతో బయటపడ్డాడు.  వాస్తవానికి కాలిఫోర్నియాలో నివసిస్తున్న 81 ఏళ్ల జెర్రీ జౌరెట్ గణిత శాస్త్రజ్ఞుడు. మాజీ NASA ఉద్యోగి. జెర్రీ మంచు తుఫాన్ కురుస్తున్న సమయంలో కారుని డ్రైవింగ్ చేసుకుంటూ హైవేపై వెళ్తూ.. మంచు తుఫానులో చిక్కుకున్నాడు. ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలోని బిగ్ పైన్‌లోని తన ఇంటి నుండి నెవాడాలోని గార్డ్‌నెర్‌విల్లేకు తన కుటుంబాన్ని కలవడానికి బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. వాతావరణం మంచిగా ఉంటే తాను ఉన్న ప్రదేశం నుంచి కుటుంబ సభ్యులున్న ప్రాంతానికి చేరుకోడానికి 3 గంటలు మాత్రమే పడుతుంది.

CNN నివేదిక ప్రకారం.. సుమారు 30 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత జెర్రీ జౌరెట్ తన కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఇరుకైన సందులో మంచు తుఫానులో చిక్కుకున్నాడు. అనంతరం జెర్రీకి ఏ రకమైన సహాయం అందలేదు.. అలా కారులో గడపవలసి వచ్చింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఎటువంటి దుస్తులు లేవు. తేలికపాటి విండ్ బ్రేకర్, హోటల్ బాత్ టవల్ ఉన్నాయి.

జెర్రీ జౌరెట్ మనవడు క్రిస్టియన్ మాట్లాడుతూ.. తన తాత జౌరెట్ కారులోనే ఉండి..  తక్కువ గ్యాస్, బ్యాటరీ శక్తిని ఉపయోగించి SUVని వేడి చేస్తూనే ఉన్నాడు. తన వెంట తీసుకెళ్లిన కొన్ని చిరుతిళ్లు తింటూ బతికాడు. ఈ సమయంలో కొన్నిసార్లు మంచు తినడానికి కారు కిటికీ అద్దాన్ని క్రిందికి తీసేవాడు.  మూడో రోజు ఎలక్ట్రిక్ కిటికీలు మూసే సమయంలో జౌరెట్ కారు బ్యాటరీ అయిపొయింది. దీంతో మరో 4 రోజుల పాటు కారు విండో కొన్ని అంగుళాలు తెరిచే  ఉంది.

ఇవి కూడా చదవండి

జౌరెట్ ఇంటి నుండి బయలుదేరిన నాలుగు రోజుల తర్వాత..  తప్పిపోయిన వ్యక్తి గురించి ఇన్యో కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి కాల్ వచ్చింది. అయితే మంచు తుఫాన్ వలన అధికారులు జౌరెట్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందనుకు రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించలేకపోయాయి. జౌరెట్ ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నించిన ఆరు రోజుల తర్వాత.. అధికారులకు అతని మొబైల్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఆధారంగా జౌరెట్ ఆచూకీని రెస్క్యూ బృందం కనుగొంది.

మూడు అడుగుల మంచులో జౌరెట్ కారు కాలిఫోర్నియా హైవే పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ వద్ద జౌరెట్ కారు మూడు అడుగుల మంచులో కురుకుపోయినట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది. అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో జౌరెట్ హెల్త్ కండిషన్ చూసి వైద్య బృందం షాక్ తిన్నారు. ఎందుకంటే అతని పల్స్ రేట్ చాలా బాగుండడం చూసి షాక్ తిన్నారు. అతను ఏడు రోజుల పాటు ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసిన పోరాటం తెలుసుకుని షాక్ తిన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..