Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Record: ఓ వైపు ఫుల్ అప్స్‌తో వరల్డ్ రికార్డ్.. మరో వైపు ఛారిటీ కోసం డబ్బులను సేకరించిన యువకుడు..

జాక్సన్ వాస్తవానికి ఇటాలియన్ . అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియలో ని సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్‌లో నివసిస్తున్నాడు. జాక్సన్ అత్యధిక పుల్ అప్‌లు  చేసిన రికార్డును నెలకొల్పాడు. 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లను పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు

Guinness World Record: ఓ వైపు ఫుల్ అప్స్‌తో వరల్డ్ రికార్డ్.. మరో వైపు ఛారిటీ కోసం డబ్బులను సేకరించిన యువకుడు..
Jaxon Italiano
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2023 | 10:09 AM

ఆరోగ్యం కోసం శారీరక ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేస్తారు. ఈ వ్యాయామంలో ఎక్కువగా ఉపయోగించే వ్యాయామాలలో ఒకటి పుల్-అప్‌లు. ఈ  పుల్-అప్స్ చలనశీలతను మెరుగుపరచడమే కాకుండా వెనుక, చేతులు, కోర్, ఛాతీ , భుజాల కండరాలను బలోపేతం చేస్తాయి. అయితే ఎన్ని పుల్ అప్‌లు చేస్తారు.. మహా అయితే ఒక 20 లేదా ఎక్కువలో ఎక్కువ 100 వరకూ చేస్తారు.. కానీ మీరు ఎప్పుడైనా ఒక రోజులో 1,000 పుల్ అప్‌లు చేశారా.. అసలు ఆలోచన కూడా మనసులో వచ్చిందా.. ఇటువంటి అరుదైన ఫిట్ ను సాధించి ఇప్పటి వరకూ ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు ఆస్ట్రేలియన్ కు చెందిన ఒక యువకుడు. వివరాల్లోకి వెళ్తే..

జాక్సన్ వాస్తవానికి ఇటాలియన్ . అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియలో ని సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్‌లో నివసిస్తున్నాడు. జాక్సన్ అత్యధిక పుల్ అప్‌లు  చేసిన రికార్డును నెలకొల్పాడు. 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లను పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. అంతేకాదు ఈ సమయంలో చారిటీ గ్రూప్ డిమెన్షియా ఆస్ట్రేలియా కోసం డబ్బును సేకరించాడు.

ఇవి కూడా చదవండి

జాక్సన్ ఫిట్‌నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. కేర్ హోమ్‌లో పనిచేసిన తర్వాత రికార్డును ప్రయత్నించడానికి ప్రేరణ పొందినట్లు  చెప్పాడు. 24 గంటల వ్యవధి ముగిసే సమయానికి, జాక్సన్ స్వచ్ఛంద సంస్థ కోసం $6,000ని అంటే మనదేశ కరెన్సీలో దాదాపు ఐదులక్షల రూపాయలను సేకరించారు. 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో.. జాక్సన్ గతం లో ఉన్న 7,715 రికార్డును బద్దలు కొట్టాడు.

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టే ప్రయత్నానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ఫుల్ అప్స్ చేయడానికి శారీరకంగా సిద్ధం కావడానికి దాదాపు 8 నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

ఇలా 8 నెలల శిక్షణ తర్వాత.. తాను తన శరీర శక్తిని పరీక్షించాలన్నట్లు నిర్ణయించుకున్నాను.. అంతేకాదు ఇప్పటికే 24 గంటల్లో అత్యధిక పుల్ అప్స్‌ ఉన్న  గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. అయితే తాను ఖచ్చితంగా ఆ రికార్డ్ ను అందుకుంటానని కానీ.. ఆ రికార్డ్ ను బీట్ చేస్తానని కానీ భావించలేదు. కానీ మనసులో నిర్ణయించుకున్నాను.. అలా ఫుల్ అప్స్ తీసి గతంలో ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టగలిగాను. చివరకు 24 గంటల్లో 8008 తీసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పగలిగాను అని అతను చెప్పాడు.

అయితే ఫుల్ అప్స్ తీస్తున్న సమయంలో అలసి పోయిన జాక్సన్ 24 గంటల వ్యవధిలో చివరి 3.5 గంటలు వినియోగించుకోలేదని జాక్సన్ అనుచరుడు  పేర్కొన్నాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..