Viral: కొడుకంటే నీలా ఉండాలి బాస్..! తల్లి కోసం ఉద్యోగం మానేసి స్కూటర్‌పై..
ఏనాడు ఏమి అడగని 70 ఏళ్ల తన తల్లి హంపి చూడాలని ఉందని అడగడంతో.. హంపియే కాదమ్మా, పెద్ద పెద్ద ఆలయాలు చూపిస్తానంటూ తీర్థయాత్ర చేపట్టాడు.
అమ్మపై ప్రేమ అపురూపమని నిరూపించాడు ఓ కొడుకు. అమ్మ కోసం ఉద్యోగం వదులుకుని తీర్థయాత్ర చేపట్టాడు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని కలికాలంలో అమ్మకు అన్నీ తానై శభాష్ అనిపించుకున్నాడు. తన తల్లి హంపి చూడాలని ఉందిరా అని అడిగిందే తడవుగా ఆయన స్పందించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.కర్ణాటకలోని మైసూరుకు చెందిన దక్షిణామూర్తి కృష్ణకుమార్ బ్యాంక్ ఉద్యోగి. ఏనాడు ఏమి అడగని 70 ఏళ్ల తన తల్లి హంపి చూడాలని ఉందని అడగడంతో.. హంపియే కాదమ్మా, పెద్ద పెద్ద ఆలయాలు చూపిస్తానంటూ తీర్థయాత్ర చేపట్టాడు. అమ్మకు దేశంలోని ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు చూపించాలని డిసైడ్ కావడంతోనే మొదట తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అమ్మతో పాటు తాను అపురూపంగా చూసుకుంటున్న 20ఏళ్ల నాటి బజాజ్ చేతక్ స్కూటర్‌కు మరమ్మతులు చేయించి తీర్థయాత్ర మొదలుపెట్టాడు. తన స్కూటర్‌పై తల్లిని ఎక్కించుకుని దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల దర్శనానికి శ్రీకారం చుట్టాడు. 70 ఏళ్ల తల్లిని వెనుక కూర్చోబెట్టుకుని హ్యాపీగా జర్నీ చేస్తున్నాడు. వంద, రెండు వందల కిలోమీటర్ల ప్రయాణానికే అలసిపోయే ఈ రోజుల్లో ఏకంగా ఇప్పటివరకు 48 వేల 100 కిలోమీటర్ల తీర్థయాత్ర పూర్తి చేశాడు. ఈ యాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నతల్లి కోరిక మేరకు కృష్ణ కుమార్ స్పందించిన తీరు నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. కృష్ణ కుమార్ తల్లి ప్రేమను చాటే అద్భుత సన్నివేశాలు ఆవిష్కరించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా స్పందించారు. తల్లిపై ఇంతలా అమితమైన ప్రేమను కురిపిస్తున్న కృష్ణ కుమార్ చాలా గ్రేట్ అంటూ కితాబిచ్చారు. అతనికి కారు బహుమానం అందించాలని నిర్ణయించుకున్నాడు. కాగా ఉద్యోగం, డబ్బు, సమయం.. అలా దేని గురించి ఆలోచించలేదని.. అమ్మను సంతోషపరచడమే ఉద్దేశంగా తీర్థ యాత్రలకు సిద్ధమైనట్లు కృష్ణకుమార్ చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం: Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!