AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eating Toilet Roll: ఈ మహిళకు వింత ఆహారపు అలవాటు.. గత 23 ఏళ్లుగా టాయిలెట్ పేపర్ తింటూ బతికేస్తుంది..

అతికొద్ది మంది మాత్రమే వింత ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు. ప్రస్తుతం ఒక మహిళ ఆహారపు అలవాట్ల గురించి చర్చ జరుగుతోంది. ఆ మహిళ తినే అలవాటు తెలిసిస్తే.. ఎవరైనా సరే.. వెంటనే ముఖం చిట్లిస్తారు.  ఎందుకంటే ఆ మహిళకు టాయిలెట్ పేపర్ ను తినడం ఇష్టం..

Eating Toilet Roll: ఈ మహిళకు వింత ఆహారపు అలవాటు.. గత 23 ఏళ్లుగా టాయిలెట్ పేపర్ తింటూ బతికేస్తుంది..
Strange Eating Disorder
Surya Kala
|

Updated on: Mar 04, 2023 | 2:17 PM

Share

ఆహారం, గాలి, నీరు ప్రతి వ్యక్తి కనీస అవసరాలు. ఆహారం తినకుండా ఎవరైనా సరే కొన్ని రోజులు మాత్రమే జీవించగలరు. ఆహారం తినే విషయంలో భిన్నమైన రుచులు ఉన్నప్పటికీ.. కొంతమంది బతకడానికి తింటారు. మరికొందరు తినడానికే బతికి ఉంటారు. చాలా మంది తినే ఆహారంలో విభిన్నమైన హాబీలు కలిగి ఉంటారు. కొందరికి ఇంట్లో వండే సింపుల్ ఫుడ్ తినాలనిపిస్తే.. మరికొందరు హోటళ్లలో స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే అతికొద్ది మంది మాత్రమే వింత ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు. ప్రస్తుతం ఒక మహిళ ఆహారపు అలవాట్ల గురించి చర్చ జరుగుతోంది. ఆ మహిళ తినే అలవాటు తెలిసిస్తే.. ఎవరైనా సరే.. వెంటనే ముఖం చిట్లిస్తారు.  ఎందుకంటే ఆ మహిళకు టాయిలెట్ పేపర్ ను తినడం ఇష్టం.. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని చికాగోలో నివసిస్తున్న ఓ మహిళ తన ఇంట్లోని టాయిలెట్ పేపర్ మాత్రమే తింటుంది. సాధారణంగా విదేశాల్లో నివసించే  ప్రజలు వాష్‌రూమ్‌లో ఉపయోగించడానికి టాయిలెట్ పేపర్‌ను కొంటారు. అయితే ఈ మహిళ దానితో పాటు అదనంగా తన ఆహారం కోసం టాయిలెట్ పేపర్‌ను కూడా కొనుగోలు చేస్తుంది. చపాతీ, సలాడ్ తింటున్నంత ఆనందంగా ఆమె టాయిలెట్ పేపర్ రోల్స్ తింటుంది.

ఆ మహిళ పేరు కేశ. మిర్రర్ యొక్క నివేదిక ప్రకారం.. 47 సంవత్సరాల కేశ టాయిలెట్ పేపర్ తినడానికి చాలా అలవాటు పడింది. రోజూ అర టాయిలెట్ పేపర్ రోల్ తింటుంది. ఇలా ఆమె 23 సంవత్సరాలుగా టాయిలెట్ పేపర్ తింటోంది. ఈ వింత వ్యసనాన్ని ఆమె వదలలేకపోతోంది.

ఇవి కూడా చదవండి

కేశకు 34 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. ఆమె TLC షో మై స్ట్రేంజ్ అడిక్షన్‌లో కనిపించింది . అప్పుడు ఆమె తన వింత వ్యసనం గురించి చెప్పింది. తనకు టాయిలెట్ పేపర్ తినడం ఇష్టమని ..ఈ అలవాటు ఆరో తరగతి చదువుతున్నప్పుడే ఏర్పడిందని చెప్పింది. తాను ప్రస్తుతం తల్లిదండ్రుల నుంచి విడివిడిగా అమ్మమ్మ, ఆంటీతో కలిసి జీవిస్తున్నానని చెప్పింది.

టాయిలెట్ పేపర్‌ను నాలుకపై పెట్టుకోగానే ‘స్వీట్ ‘లా కరిగిపోతుందని.. ఇదే తనకు నచ్చిందని అంటోంది. తాను రోజూ రెండు మూడు కాదు 75 టాయిలెట్ పేపర్లు తింటానని చెప్పింది. 2010 నుండి.. ఇప్పటి వరకూ 500 కిలోల కంటే ఎక్కువ టాయిలెట్ పేపర్‌ను తిన్నట్లు తెలుస్తోంది. ఈ అలవాటు ఆమెకు కడుపులో నొప్పిని కలిగిస్తుంది.. అప్పుడు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. మళ్ళీ ఆరోగ్యంగా అయిన తర్వాత టాయిలెట్ పేపర్‌ను తినడం ప్రారంభిస్తుంది. ఇప్పటికే కేశ కు అనేక సార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.    టాయిలెట్ పేపర్ తినడం తగ్గింది.. కానీ ఈ అలవాటుని పూర్తిగా వదిలివేయలేకపోయింది. ఈ అలవాటుని వైద్య పరిభాషలో  జిలోఫాగియా అంటారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..