Food Crisis in UK: ఆకలి కేకలతో అల్లాడుతున్న బ్రిటన్ వాసులు.. రెండుకు మించి పండ్లు, కూరగాయలు కొనకూడదని ఆంక్షలు..

బ్రిటన్ లో ఉండే 4 అతిపెద్ద సూపర్ మార్కెట్లు మోరిసన్స్, అస్డా, ఆల్డి, టెస్కోలలో తాజా పండ్లు, కూరగాయలపై పరిమితులను విధించాయి. ఇక్కడ టమోటాలు కొనాలనుకుంటే కేవలం 2 నుండి 3 టమోటాలు మాత్రమే కొనాలి. యూకే వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Food Crisis in UK: ఆకలి కేకలతో అల్లాడుతున్న బ్రిటన్ వాసులు.. రెండుకు మించి పండ్లు, కూరగాయలు కొనకూడదని ఆంక్షలు..
Food Crisis In Uk
Follow us
Surya Kala

|

Updated on: Mar 03, 2023 | 7:54 AM

ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్‌ నేడు ఆకలి కేకలు పెడుతోంది..రవి అస్తమించని సామ్రాజ్యంలో టమోటా కూడా దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తోంది. పండ్లు, కూరగాయలకు కూడా నోచుకోని దైన్య స్థితి..సూపర్‌ మార్కెట్లన్నీ ఖాళీ..ఫ్రూట్స్‌ మార్కెట్లన్నీ బోసిపోతున్నాయి. అతిపెద్ద సూపర్‌ మార్కెట్‌లో కూడా రెండు ఆలుగడ్డల కంటే ఎక్కువ కొనలేరు. కొనకూడదు. కొనడానికి నో పర్మిషన్‌..ఇదీ బ్యూటిఫుల్‌ బ్రిటన్‌ సిచ్యుయేషన్‌..ఇంకా చెప్పాలంటే.. ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో.. టైమ్‌ బ్యాడ్‌ అయితే సీన్‌ సితారే..నో డౌట్‌.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది. నేడు ఆకలి కేకలతో ఆల్లాడుతోంది. ఒకనాడు ఎన్నోదేశాలను భయపెట్టింది. తన చెప్పుచేతల్లోకి తీసుకుంది. ఇప్పుడు టమోటా దొరక్క చతికిల పడుతోంది.

సింపుల్‌గా చెప్పాలంటే..పాకిస్థాన్ బాటలోనే బ్రిటన్ కూడా పయనిస్తోంది. ఇక్కడ కూడా పండ్లు, కూరగాయల కొరత ఉంది. అన్ని సూపర్ మార్కెట్లలో రెండుకు మించి ఎక్కువ పండ్లు కానీ.. కూరగాయలు కానీ కొనకూడదు..రెండంటే రెండే..అలా ఫిక్స్‌ చేశారు..ఎంత డబ్బు చెల్లించినా బంగాళదుంపలు, టమాటా వంటి వాటిని పెద్దమొత్తంలో కొనలేరు. కమ్మగా టమోటా సూప్‌ కూడా తాగలేని స్థితి బ్రిటన్‌లది.. బ్రిటన్‌లోని అతిపెద్ద సూపర్‌మార్కెట్‌లో 2 కంటే ఎక్కువ బంగాళదుంపలు లేదా టమోటాలు కూడా కొనలేని దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ది గ్రేట్‌ బ్రిటన్‌..

టమోటా సూప్‌ తాగలేరు.. ఆలుగడ్డలతో కర్రీ చేసుకోలేరు. మిగతావాటినైనా తీసుకుందామనుకుంటే అవి కూడా అంతంత మాత్రమే.. ఏవైనా సరే రెండుకు మించి తీసుకోకూడదు. దటీజ్‌ రూల్‌..

ఇవి కూడా చదవండి

చాలా సూపర్‌ మార్కెట్లలో ర్యాక్‌లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. చాలా రోజుల నుంచీ ఇదే దుస్థితి.. కొద్ది రోజులుగా UKలోని సూపర్ మార్కెట్ షెల్ఫ్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇది ఏ ఒక్క UK సూపర్‌మార్కెట్‌కు సంబంధించిన విషయం కాదు, దాదాపు అన్నిచోట్లా ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఇవే ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. UK ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోంది..పాకిస్తాన్‌ బాట పడుతోంది..దీంతో పాటు ద్రవ్యోల్బణం కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది.

బ్రిటన్ లో ఉండే 4 అతిపెద్ద సూపర్ మార్కెట్లు మోరిసన్స్, అస్డా, ఆల్డి, టెస్కోలలో తాజా పండ్లు, కూరగాయలపై పరిమితులను విధించాయి. వీటిలో టమోటాలు, బంగాళదుంపలు, దోసకాయలు, క్యాప్సికమ్, బ్రకోలీ.. వంటి పాడైపోయే పండ్లు, వెజిటబుల్స్‌ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ టమోటాలు కొనాలనుకుంటే కేవలం 2 నుండి 3 టమోటాలు మాత్రమే కొనాలి.. అంతకుమించి కావాలని ఎంత మొత్తుకున్నా కంఠశోషే తప్ప ఒక టమోటా కూడా ఇవ్వరు. దీంతో యూకే వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా బ్రిటన్‌ ప్రజలు ఆలుగడ్డ, టమోటా పండ్లను ఎక్కువగా ఇష్టపడతారు. సలాడ్‌లు అంటే బ్రిటన్‌లకు చాలా ఇష్టం..మూడు వారాలుగా వీళ్లు సలాడ్‌ తినలేకపోతున్నారు. సీజనల్‌ కొరత కావొచ్చు. మరే ఇతర కారణమైనా కావొచ్చు. మొత్తానికి లండన్‌లోని అన్ని సూపర్‌ మార్కెట్లు పండ్లు, కూరగాయల కొరతతో వెలవెలబోతున్నాయి.

దక్షిన యూరప్‌, ఉత్తరాఫ్రికాలో పంటలకు అంతరాయం కలగడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కొందరి వాదన..ఈ దుస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి.. చివరకు దోసకాయలు కూడా వాళ్లతో దోబూచులాడుతున్నాయి. బ్రిటన్లు అన్నింటికీ పెప్పర్‌ వాడుతారు. ఇప్పుడు నో పెప్పర్‌.. నో మిరియాలు..పంట దిగుబడి లేక, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక..ప్రభుత్వానికే దిక్కుతోచని స్థితి ఏర్పడింది.

అధిక ఖర్చులతో పంట సాగు ఒక కారణమైతే.. బ్రిటన్‌, నెదర్లాండ్స్‌లో పండ్లు, కూరగాయల తక్కువ ఉత్పత్తి జరగడంతో..సలాడ్‌ సంక్షోభం తల్లెత్తింది. రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో అన్ని మార్కెట్లలో ఫ్రూట్లు, వెజిటబుల్స్‌తో ఉండాల్సిన ట్రేలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరో నెల వరకు ఈ దుస్థితి తప్పదని బ్రిటన్‌ మంత్రులే చెబుతున్నారు.

ప్రపంచంలో ఆరో లార్జెస్ట్‌ ఎకానమీ ఉన్న బ్రిటన్‌ ప్రస్తుతం తిండి కొనుక్కోలేని దుస్థితిలోఉంది..పండ్లు, కూరగాయల దిగుబడి కోసం రైతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. మార్గదర్శకాలు ఇస్తోంది..అయినా పరిస్థితి గాడిన పడటంలేదు.

అసలు బ్రిటన్‌కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా ఎందుకు పయనిస్తోంది.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది.

బ్రిటన్‌లో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ

బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది. దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్‌ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేస్తోంది. అయితే, ఇంకో నెల వరకు ఈ సలాడ్‌ సంక్షోభం తప్పదు. ఈలోగా రిషి సునాక్‌ దేశంలో అదుపు తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టకపోతే..పరిస్థితులు విషమించేలా ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా..తమకీ గడ్డు పరిస్థితులేంటని జనం నిలదీస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?