- Telugu News Photo Gallery Baguio's Panagbenga Flower Festival in full bloom this weekend Telugu News
Flower Festival: ఇది బతుకమ్మ కాదు..!..నెల రోజుల పాటు సాగే పూల పండగ.. ఎక్కడో తెలుసా..?
పూల పండగ అంటే అందరికీ తెలిసింది తెలంగాణలో దసరా సమయంలో తొమ్మిది రోజుల పాటు చేసుకునే బతుకమ్మ పండగే.
Updated on: Mar 02, 2023 | 3:48 PM

బతుకమ్మ తరహాలో కాకపోయినా అలాంటి ఒక పుష్పాల పండుగ ఫిలిపైన్స్‌లోనూ జరుగుతుంది.

ఏటా ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ పూల వేడుక దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది. దీన్ని ఫిలిపైన్స్ భాషలో పనాగ్‌బూనా అంటారు.

ఆటపాటలతో సందడిగా సాగే ఈ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఫ్లవర్ థీమ్‌తో వాళ్లు ధరించే దుస్తులు చాలా చిత్రంగా ఉంటాయి. ఈ వేడుకలు చూసేందుకు ఫిలిపైన్స్ దేశంలోని అన్ని ప్రాంతాల వారు వస్తుంటారు.

1990లో సంభవించిన భూకంపం తిరిగి కోలుకున్న సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ వేడుక నిర్వహిస్తున్నారు. కొవిడ్ కారణంగా 2020, 2021లో వీటిని రద్దు చేశారు. 2022లో నిర్వహించినా చాలా పరిమితస్థాయిలోనే అది సాగింది.

ఇప్పుడు ఆంక్షలేవి లేకపోవడంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రెగ్యులర్‌గా రిహార్సాల్స్ జరుగుతుంటాయి.

సీతాకోకచిలుకలు, బన్నీలు, స్ట్రాబెర్రీలతో సహా ఎన్నో రకాలు, వివిధ సైజుల్లో బొమ్మలు వివిధ రకాల, రంగులు, ఆకారాలు, పరిమాణాల పువ్వులతో తయారు చేసిన అలంకరణలు ఆకట్టుకుంటుంటాయి.
