California: కాలిఫోర్నియాని ముంచెత్తుతున్న మంచు తుఫాన్.. జనజీవనం అస్తవ్యస్తం..
దక్షిణ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. సదరన్ న్యూ ఇంగ్లాండ్‌లో చాలా చోట్ల పాఠశాలలను మూసివేశారు. ఇదే ప్రాంతంలో ఎనిమిది అంగుళాల మేర మంచుపేరుకుపోయింది.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని మంచుతుఫాను హడలెత్తిస్తోంది. గత నాలుగు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికాలోని అనేక ప్రాంతాలను మంచు కమ్మేసింది. సర్వం మంచుమయంగా మారడంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. కాలిఫోర్నియాలోని నెవెడా రేంజ్‌లోనూ, ఈశాన్య ప్రాంతాల్లోనూ భారీగా మంచుకురుస్తోంది. కనెక్టికట్, న్యూయార్క్, మస్సాచూసెట్స్, న్యూజెర్సీ, ఐలాండ్‌ల మార్గాల్లో రోడ్లపై కుప్పలుగా మంచుపేరుకుపోయింది. మంచును తొలగించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. కనెక్టికట్‌లో జనం ఎవ్వరూ అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. సదరన్ న్యూ ఇంగ్లాండ్‌లో చాలా చోట్ల పాఠశాలలను మూసివేశారు. ఇదే ప్రాంతంలో ఎనిమిది అంగుళాల మేర మంచుపేరుకుపోయింది. అనేక ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. 3000 పైగా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
అయితే ఇక్కడ కురుస్తున్న మంచు వర్షాలతో కాలిఫోర్నియాలోని చాలా రిజర్వాయర్‌లు నిండుకుండను తలపిస్తున్నాయి. రిజర్వాయర్‌లు సగటున లేదా అంతకంటే ఎక్కువ నీటి మట్టాలతో నింపబడ్డాయని USDM పేర్కొంది. అయితే భూగర్భజల స్థాయిలు తక్కువగా ఉన్నాయని .. భాగర్భ జలం స్థాయి మెరుగుపడడానికి మరింత మెరుగు పడడానికి నెలలు పట్టవచ్చు అని వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..