Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పైసా ఖర్చు లేకుండా ప్రియురాలికి డైమాండ్‌ నెక్లెస్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన యువకుడు..! యువతి ఫిదా..

ఇది చూసిన చాలా మంది నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఆశ్చర్యంతో ముక్కవేలేసుకుంటున్నారు. ఏం ఐడియా గురూ..! పైసా ఖర్చు లేకుండా ప్రియురాలిని ఫిదా చేసేందుకు భలే ట్రిక్‌ ప్లే చేశావే అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Viral News: పైసా ఖర్చు లేకుండా ప్రియురాలికి డైమాండ్‌ నెక్లెస్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన యువకుడు..! యువతి ఫిదా..
Chinese Man Makes Necklace
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 03, 2023 | 3:17 PM

తమ భాగస్వామికి డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఆ కలను సాకారం చేసుకునేందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఎన్నో కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. అయితే, మాత్రం ఒక యువకుడు తన ప్రియురాలికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆకర్షణీయమైన, డైమాండ్ కంటే కూడా ధగధగ మెరిసే హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. తన భాగస్వామికి సర్‌ప్రైజ్‌గా గిఫ్ట్‌ ఇచ్చి ఎలా ఉంది అని అడిగాడు.. అదేలే ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి…

మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి, ఖరీదైన బహుమతులు మాత్రమే ముఖ్యం కాదు. అందుకు బదులుగా మీరు మీ సృజనాత్మక ఆలోచనలతో కూడా వారిని సంతోషపెట్టొచ్చు. అదేలాగో ఇక్కడ ఈ జంటను చూస్తే అర్థం అవుతుంది. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన జాంగ్ తన ప్రేయసికి వెలుతురులో ప్రతిబింబించేలా కనిపించే అందమైన డిజైన్‌తో కూడిన నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చాడు, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెల్ల కాగితాన్ని పెట్టెలో పెట్టి తన భాగస్వామికి బహుమతిగా ఇచ్చాడు. ఆ తరువాత అతను ఆమెను బయట సూర్యకాంతిలోకి తీసుకువెళ్లాడు. తెల్ల కాగితం ప్రతిబింబం ద్వారా ఫంక్షనల్‌గా రూపొందించిన నెక్లెస్‌ డిజైన్‌ సరిగ్గా ఆమె మెడలో ఒదిగేపోయే విధంగా సెట్‌ చేశాడు.

Chinese Man Makes Necklace1

తన ప్రియురాలికి నెక్లెస్ తయారు చేసేందుకు ఈ చైనీస్ వ్యక్తి స్టెన్సిలింగ్, లైట్ ఉపయోగించాడు. ఇదిలా ఉంటే, గత ఏడాది తన స్నేహితుడికి పేపర్ స్టెన్సిల్ ఉపయోగించి డైమండ్ రింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చినట్టు సమాచారం.

తెల్లటి షీట్‌పై అందమైన ఈ లైట్ రిఫ్లెక్టివ్ నెక్లెస్‌ని డిజైన్ చేయడానికి రెండు రోజుల సమయం పట్టిందని చెప్పాడు. డౌయిన్‌లో జాంగ్ అప్‌లోడ్ చేసిన నెక్లెస్ వీడియోను 62 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. అలాగే 40,000కు పైగా కామెంట్స్ పెట్టారు. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఆశ్చర్యంతో ముక్కవేలేసుకుంటున్నారు. ఏం ఐడియా గురూ..! పైసా ఖర్చు లేకుండా ప్రియురాలిని ఫిదా చేసేందుకు భలే ట్రిక్‌ ప్లే చేశావే అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ న్యూస్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: