Viral: ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులౌట్!
ఓ వ్యక్తి తీవ్రమైన ఛాతీనొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం వచ్చిన..

ఓ వ్యక్తి తీవ్రమైన ఛాతీనొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూడగా.. వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎక్స్‌రేలో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. సీన్ కట్ చేస్తే..
వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో చివరికి ఓ పెద్దాసుపత్రికి వెళ్లాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చెక్ చేయగా.. సదరు వ్యక్తి ఊపిరితిత్తుల్లో దంతం ఇరుక్కుందని గుర్తించారు. బ్రాంకోస్కోపీ ద్వారా ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి.. సుమారు రెండు గంటల పాటు శ్రమించి దంతాన్ని బయటికి తీశారు.
కాగా, తాను కట్టించుకున్న కృతిమ దంతాన్ని అనుకోకుండా మింగేశానని.. అది అనూహ్యంగా ఛాతీలో ఇరుక్కోవడంతో తీవ్రమైన నొప్పి రావడం మొదలైందని.. క్రమంగా ఆ నొప్పి పెరుగుతూపోతుండటంతో వైద్యుడ్ని సంప్రదించానని సదరు వ్యక్తి వివరించాడు. అటు ఆపరేషన్ విజయవంతం అయిందని.. ప్రస్తుతం రోగి పరిస్థితి బాగుందని.. కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ గామి తెలిపారు.